మానవత్వం మంట కలిసింది... గర్బవతిని నిలబెట్టే కాన్పు చేసిన వైధ్యులు, ఆ తర్వాత కూడా దారుణం

ఒక మహిళ జీవితంలో ప్రసవం అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒక చిన్నారి పాపాయికి జన్మను ఇవ్వడం అంటే మరో జన్మను ఎత్తినట్లుగా చెబుతారు.

 Humanity Has Become Inflamed-TeluguStop.com

పురిటి నొప్పులు భరించి పాపకు జన్మనిచ్చే సమయంలో ఆ మహిళను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.ఆ సమయంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా కూడా అధిక బ్లీడింగ్‌ అయ్యి పెద్ద ప్రాణంకే ప్రమాదం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే మహిళ డెలవరీ సమయంలో చాలా చాలా జాగ్రత్తలు వ్యవహరిస్తూ ఉంటారు.అయితే గుజరాత్‌లో మాత్రం ఒక మహిళకు ప్రభుత్వ హాస్పిటల్‌లో వైధ్యులు చేసిన డెలవరీ అత్యంత దారుణంగా చెబుతున్నారు.

ఆ సంఘటన వైధ్య వృత్తి చేస్తున్న వారికే సిగ్గు చేటుగా అనిపిస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన రామీ బెన్‌ అనే మహిళ గర్బం దాల్చింది.

ఆమె నిండు నెలలతో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లింది.నొప్పులు వస్తున్న కారణంగా ఆమెను బంధువులు హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.ఆ సమయంలో హాస్పిటల్‌లో డాక్టర్స్‌ లేరు.దాంతో అక్కడ ఉన్న సిస్టర్స్‌ ఆమెకు వైధ్యం చేయాల్సి వచ్చింది.

వైధ్యులకు సమాచారం అందించగా వస్తున్నాం, మీరు డెలవరీ చేయండి అంటూ సిస్టర్‌కు ఆదేశాలు ఇచ్చారట.దాంతో ఒక సిస్టర్‌ రామీ బెన్‌ను డెలవరీ రూంకు తీసుకు వెళ్లింది.ఒక కడ్డీ పట్టుకుని నిల్చోబెట్టింది.నిల్చున్న చోటే రామీ బెన్‌ కు పురుడు పోసింది.

రామీ బెన్‌ను నిల్చోబెట్టే డెలవరీ చేయడంతో పాటు, రక్తపు మరకలను కూడా రామీ బెన్‌తోనే తూడిపించారు.విషయం రామీ బెన్‌ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హాస్పిటల్‌ సిబ్బందిపై దాడికి దిగారు మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే వైధ్యులు మాత్రం అలా ఏం జరగలేదని, నార్మల్‌గా డెలవరీ అయ్యేందుకు కొన్ని సార్లు అలాంటి పద్దతులు వాడుతారు.కాని ఆ తర్వాత ఆమెను బెడ్‌ పైకి తీసుకు వెళ్లారు అంటూ వైధ్యులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ విషయమై రామీ బెన్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్దం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube