వైరల్ వీడియో: నోరు తెరుస్తున్న పర్సు!

ప్రపంచంలో వింతలు ఏడు ఉంటాయి అని పెద్దలు అంటూ ఉంటారు.కానీ ఇప్పుడు ఉన్న యువత తమ ఆలోచనల తో నిత్యం బోలెడు వింతలు సృష్టిస్తున్నారు.

 Human Flesh Coin Purse-TeluguStop.com

ఇప్పుడు అలాంటి వింత వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ వింత వీడియో ఏంటి అని అనుకుంటున్నారా.

కింద ఉన్న ఫోటోను చూస్తే మీకు అర్ధం అవుతుంది.ఆ ఫోటోలో ఒక మనిషి నోరు ఉంది.

అయితే ఆ నోట్లో నుంచి నాణాలు వస్తున్నాయి.అవేలెండీ కాయిన్స్ వస్తున్నాయి.

అదేంటి నోటిలో పళ్లు ఉండాలి కానీ కాయిన్స్ ఏంటి అని అనుకుంటున్నారా.మరి అందుకే దీనిని వింత అని అన్నది.

నిజంగా దానిని చూస్తే మనిషి నోట్లో నుంచి కాయిన్స్ వస్తున్నాయి ఏంటి అని అనుకుంటాం.కానీ అది నోరు కాదని పర్సు అని ఆ తరువాత తెలిసింది.

ఈ పర్సను జపాన్ కు చెందిన మ్యూజిక్ కంపోజర్,ఆర్టిస్ట్ డూ డిజైన్ చేశారట.ఈ పర్సు ని తెరవాలి అంటే అలా దాని నోరు తెరవాల్సిందేనట.


అచ్చం మనిషి నోరులా కనిపించే ఈ పర్సు ని తయారు చేసి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్స్ ఎవరి వారు వాళ్ల నోరెళ్ల బెడుతున్నారట.నిజంగా అతడి క్రియేటివిటీ కి అందరూ ఫిదా కూడా అయిపోతున్నారు.దీనితో దానిని ఎలా తయారు చేసారు, అది ఎంత అని అంటూ ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు.

దానికి డూ మాత్రం నేనేమీ దీన్ని మార్కెట్ చేయాలనీ అనుకోవడం లేదు అని చెప్పి తప్పుకుంటున్నాడట.మరి ముందు ముందు డూ దీనిని మార్కెట్ చేయకుండా మానడు,అప్పుడు అందరి చేతుల్లో ఇలాంటి పర్సులు అందరి చేతిలో ఉండక పోవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube