షకీలా జీవితకథ మీద సినిమా వస్తోందోచ్

కొన్ని సంవత్సరాల క్రితం సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా వచ్చిన డర్టిపిక్చర్ సినిమా గుర్తింది కదా.విద్యాబాలన్ సిల్క్ స్మితగా నటించిన ఆ చిత్రం అప్పట్లో ఓ సంచలనం.

 Huma Qureshi To Act In Shakeela’s Biopic?-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద లాభాలు కొల్లగొట్టి, కొన్నిరోజుల వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు అదే పద్ధతిలో మరో శృంగార తార షకీలా జీవితకథను ఆధారం చేసుకోని మరో సినిమా రాబోతోంది.

మళయాళ దర్శకుడు ఇంద్రజీత్ లంకేష్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పని మీదే బిజీగా ఉన్నాడు.దీన్ని కేవలం మళయాలం వరకే పరిమితం చేయకుండా, దక్షిణాది భాషలన్నిటిలోకి, కుదిరితే హిందీలో కూడా విడుదల చేయాలని దర్శకుడి ప్లాన్.

ఇంతకి షకీలాగా ఎవరు నటించబోతున్నారో చెప్పనే లేదు కదూ.బాలివుడ్ భామ హుమా ఖురేషి ఈ పాత్రను పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ భామ ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన వైట్ అనే చిత్రంలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube