కోవిడ్ 'పేషెంట్స్'కు 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్న నటి...

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే.గత ఏడాది నుండి వణికిస్తున్న ఈ వైరస్.

 Huma Qureshi Launch Hospital Facility Fight Covid-TeluguStop.com

ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతూ మరణిస్తున్న ఎంతోమంది వైరస్ బాధితులు కోలుకోవడానికి.

సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.ఇక సరైన బెడ్ లు, ఆక్సిజన్ లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు సహాయం చేయడానికి ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.

 Huma Qureshi Launch Hospital Facility Fight Covid-కోవిడ్ పేషెంట్స్’కు 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్న నటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


ఇక తాజాగా ఏకంగా వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ముందుకు వచ్చింది.హాలీవుడ్ దర్శకుడు జాక్ స్పైడర్ తో కలిసి 100 పడక గదుల ఆస్పత్రి సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించింది.

సేవ్ ది చిల్డ్రన్ సంస్థతో కలిపి దీని కోసం పని చేయనున్నట్లు తెలిపింది.అంతే కాకుండా కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించడానికి స్పెషల్ కిట్స్ అందిస్తామని తెలిపింది.

అంతేకాకుండా రోగి కోలుకునే వరకూ వారితో డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండే ఏర్పాటు చేస్తామని తెలిపింది.


ఇందుకోసం ప్రజలను మద్దతు ఇవ్వాలని కోరింది.

భారత్ లో కోవిడ్ కేసులు, సరైన వైద్యం అందక ప్రజలు పడుతున్నా బాధలు చూసి తట్టుకోలేకపోతున్నానని తెలిపింది.కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని తన వంతు సహాయం చేసేందుకు అండగా నిలబడతానని భరోసా ఇచ్చింది.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు అనాథ పిల్లల బాధ్యత తీసుకోవడం, సేవా సంస్థలతో పలు సదుపాయాలు కల్పించడం, ఆక్సిజన్, ప్లాస్మా వంటివి అందించడం.అంతేకాకుండా హాస్పిటల్ కట్టడానికి ముందుకు వచ్చిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కదలకున్నా.సెలబ్రెటీలు, సామాన్య ప్రజలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

#100Bed Hospital #HumaQureshi #Launch Hospital #Huma Qureshi #Covid Patients

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు