మద్యం మత్తులో పోలీస్ ఆఫీసర్‌ కొడుకునంటు యువకుడి హల్‌చల్.. చివరికి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు.. !

చట్టం ఎవరి చుట్టం కాదు.న్యాయం దృష్టిలో అందరు సమానమే కానీ కొందరు మాత్రం న్యాయాన్ని బజార్లో నిలబెట్టాలని ప్రయత్నిస్తారు.

 Hulchul As The Son Of A Police Officer Intoxicated-TeluguStop.com

ఆ సమయంలో చట్టంలోని మనుషులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తే చట్టానికి విలువ మరింత పెరుగుతుంది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న వారి పేర్లు, అధికారుల పేర్లు చెప్పుకుని జులుం చలాయిస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు.

 Hulchul As The Son Of A Police Officer Intoxicated-మద్యం మత్తులో పోలీస్ ఆఫీసర్‌ కొడుకునంటు యువకుడి హల్‌చల్.. చివరికి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా కొందరి నేతల, పోలీస్ అధికారుల కొడుకులు కూడా విచక్షణ మరచి అహాంకారంతో ప్రవర్తిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

కేపీహెచ్ బీ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే.ఓ పోలీసు అధికారి కుమారుడు అతని స్నేహితుడితో కలసి రోడ్డు పై హల్ చల్ చేశారు.

రోడ్డు పక్కన సోడాలు అమ్మే వ్యక్తితో మందులో కలుపుకోవడానికి నీళ్లు ఇవ్వాలి అంటూ గొడవకు దిగారు.

వీరి ఆగడాలకు విసిగిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్దలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారట.

కాగా వీరి విచారనలో ఆ ఇద్దరు యువకుల్లో ఒకరి తండ్రి ఎఆర్ లో అదనపు ఎస్పీ కాగా, మరొకతను డాక్టర్ అరుణ్ అని తేలిందట.మద్యమత్తులో ఉన్న వీరి పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

మరి న్యాయం ఇక్కడ అన్యాయం అవుతుందా, లేక తన విలువ కాపాడుకుని ఇలాంటి వారికి శిక్షపడేలా చేస్తుందా చూడాలి.

#KPHB #Hyderabad #Police Station #Intoxicated #Police Officer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు