హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల ! నోటిఫికేషన్ ఎప్పుడంటే ?

చాలా నెలలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేసింది.దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి.

 Hujurabad Election Shedul Relised-TeluguStop.com

అక్టోబర్ ఒకటో తేదీన నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.

  అక్టోబర్ 8 వరకు నామినేషన్ దాఖలుకు గడువు విధించారు. అక్టోబర్ 11 నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది.

 Hujurabad Election Shedul Relised-హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల నోటిఫికేషన్ ఎప్పుడంటే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలింగ్ తేదీ అక్టోబర్ ౩౦.నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.అదే రోజున ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

దాదాపు మూడు నెలలుగా హుజురాబాద్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఉత్కంఠగా ఎదురు చూపులు చూస్తున్నాయి.

ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉంది.ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ తనపై ఉన్న సెంటిమెంటు పోతుందనే భయంలో ఈటెల రాజేందర్ ఉన్నారు.పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలతో పాటే హుజురాబాద్ లోను ఎన్నికలు జరుగుతాయని ఆశించినా, కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పండుగలు, భారీ వర్షాలు ఇలా అనేక కారణాలతో ఎన్నికలను వాయిదా వేసింది.కానీ ఇప్పుడు షెడ్యూల్ ను ప్రకటించడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి.

ఇప్పటికే టిఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించినా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి వేటలో ఉంది.బిజెపి నుంచి దాదాపు ఈటెల రాజేందర్ పేరే ఖరారు కాబోతోంది.జూన్ 4వ తేదీన ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, 12వ తేదీన స్పీకర్ దాన్ని ఆమోదించడంతో హుజురాబాద్ లో ఎన్నికల హీట్ మొదలైంది.అప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు అక్కడే మకాం వేసి తమ పార్టీకి విజయం దక్కేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.

సభలు, సమావేశాలు అంటూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే వచ్చాయి.

#Congress #Etela Rajendar #Central #Hujurabad #TRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు