కౌగిలింత వలన దొరికే లాభాలు

అదేదో హిందీ సినిమాలో చెప్పినట్లు, ఓ కౌగిలింత ఎన్నోరకాల రోగాల నుంచి విముక్తినిస్తుంది.ఎందుకంటే కౌగిలింతలో మనిషికి కావాల్సిన ప్రేమ, ఆప్యాయత దొరుకుతాయి.

 These Are The Healthy Benefits A Hug Carries-TeluguStop.com

వాకింగ్, రన్నింగ్‌ ఎలాగైతే నరాల్లో, మెదడులో ఎన్నోరకాల రియాక్షన్స్ కి కారణమై మన శరీరాన్ని ఉత్సాహవంతంగా, ఆరోగ్యవంతంగా చేస్తాయో, కౌగిలింతలు అంతే.మరి కౌగిలింత వలన కలిగే లాభాలపై ఓ లుక్కేద్దామా!

* కౌగిలింతలో ఉన్నప్పుడు మెదడులోంచి డొపమైన్ విడుదల అవుతుంది.

ఇది మీ నరాలకు రిలాక్సేషన్ ని అందిస్తుంది.తర్వాతా శరీరానికి హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది.

* మూడ్ స్వింగ్స్ అబ్బాయిల్లో, అమ్మాయిల్లో ఉన్నా, కొన్ని శారీరక కారణాల వలన అమ్మాయిల ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండం కష్టం.మూడ్ స్వింగ్స్ ని ఆపేందుకు కౌగిలింత పనికివస్తుంది.

మీకు ఇష్టమైన అమ్మాయి మీ మీద కోపంగా ఉంటే కౌగిలింత ఆ కోపాన్ని చల్లార్చుతుంది.

* ఇంతకుముందు చెప్పినట్లుగా కౌగిలింత వలన మొదడులో డొపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది.

దానివలన డిప్రేషన్ తగ్గుతుంది.

* డొపమైన్ లెవెల్స్ తక్కువ ఉంటే పార్కిన్సన్ అనే వ్యాధి వస్తుంది.

కౌగిలింత డొపమైన్ లెవెల్స్ ని పెంచుతుంది కాబట్టి, ఈ వ్యాధితో బాధపడేవారికి కౌగిలింత మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

* కౌగిలింత ముఖంపై చిరునవ్వుని తేవడమే కాదు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అందుకే ప్రేమించేవారుంటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు.

* స్ట్రెస్ వలన హార్మోనులలో సమతుల్యత లోపిస్తుంటుంది.

అలాగే రోగనిరోధకశక్తి దెబ్బతింటూ ఉంటుంది.కౌగిలింతలు స్ట్రెస్ ని దూరం చేసి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube