భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధర.. యూజర్లకు గుడ్ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో సినిమా థియేటర్‌లకు వెళ్లడం తగ్గించేశారు.పలు వీడియో స్ట్రీమింగ్ యాప్‌లపై ఆధారఫడుతున్నారు.

 Hugely Reduced Netflix Subscription Price  ,good News For Users , Netflix , Subs-TeluguStop.com

వాటికి కూడా ఆదరణ పెరుగుతోంది.కరోనా వల్ల ఇది మరింత ఎక్కువైంది.

యూజర్లను ఆకట్టుకునే కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రజలు ఆసక్తిగా ఇంట్లోనే వీక్షిస్తున్నారు.టీవీ, ఫోన్లలో ఆయా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని, వాటికి సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించి వాటిని చూసి ఆనందిస్తున్నారు.

ఈ క్రమంలో వివిధ యాప్‌ల మధ్య పోటీ పెరుగుతోంది.ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ గతంలో సబ్‌స్క్రిప్షన్ రుసుము బాగా పెంచింది.

ఫలితంగా భారీగా యూజర్లు తగ్గిపోయారు.దీంతో సబ్‌స్క్రిప్షన్‌లు పెంచుకునేందుకు భారీగా నెట్‌ఫ్లిక్స్ ధరలు తగ్గించింది.

ఈ నిర్ణయం బాగా ఉపయోగపడిందని కంపెనీ చెబుతోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో ధరలను తగ్గించే వ్యూహం ఫలిస్తున్నట్లు పేర్కొంది.సబ్‌స్క్రిప్షన్ ధర తగ్గింపుతో ప్లాట్‌ఫారమ్ తన సబ్‌స్క్రైబర్ బేస్‌లో పెరుగుదల కనిపించిందని కంపెనీ అధికారులు తెలిపారు.

డిసెంబర్ 2021లో నెట్‌ఫ్లిక్స్ దాని అసలు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను బాగా తగ్గించడం ద్వారా కొత్త ధరలను అందుబాటులోకి తెచ్చింది.మొబైల్ ప్లాన్ ధర గతంలో రూ.199 నుండి రూ.149కి తగ్గించబడింది.నెలకు రూ.499 ధర ఉన్న బేసిక్ ప్లాన్‌ను నెలకు రూ.199కి తగ్గించారు.స్టాండర్డ్ ప్లాన్ ఇప్పుడు రూ.649తో పోలిస్తే రూ.499గా ఉంది.ప్రీమియం ప్లాన్ ధర రూ.799 నుంచి రూ.649కి తగ్గించబడింది.దీంతో యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది.

తక్కువ ధరకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫేమస్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను నెట్‌ఫ్లిక్స్ ద్వారా చూడగలుగుతున్నామని యూజర్లు సంతోషంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube