రవితేజ కూడా ఈ మాయలో పడితే నిర్మాత పరిస్థితి ఏంటీ?  

Huge Budjet For Ravi Teja Disco Raja Movie-movie Budjet Is 30 Crores,paya Rajputh,ravi Teja Disco Raja Movie

ఒకప్పుడు రవితేజ సినిమా బడ్జెట్‌ అంటే 10 నుండి 15 కోట్ల వరకు ఉండేది.చాలా అరుదుగా మాత్రమే 20 కోట్లను దాటేది.ప్రస్తుతం రవితేజ కెరీర్‌ అంతంత మాత్రంగానే ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో గత బడ్జెట్‌ల కంటే తక్కువ ఉండాలి.కాని అవివేకమో లేక అతి నమ్మకమో కాని ప్రస్తుతం రవితేజ చేస్తున్న డిస్కోరాజా చిత్రంకు ఏకంగా 30 కోట్ల వరకు బడ్జెట్‌ పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ చిత్రంలోని ఒక ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా 5 కోట్లను ఖర్చు చేస్తున్నారట.

Huge Budjet For Ravi Teja Disco Raja Movie-movie Budjet Is 30 Crores,paya Rajputh,ravi Teja Disco Raja Movie-Huge Budjet For Ravi Teja Disco Raja Movie-Movie Is 30 Crores Paya Rajputh Movie

Huge Budjet For Ravi Teja Disco Raja Movie-movie Budjet Is 30 Crores,paya Rajputh,ravi Teja Disco Raja Movie-Huge Budjet For Ravi Teja Disco Raja Movie-Movie Is 30 Crores Paya Rajputh Movie

రవితేజ ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క ఫైట్‌ కోసం ఇంత ఖర్చు చేయడం అనేది రికార్డు అయ్యి ఉంటుంది.పెద్దగా అంచనాలే లేని ఈ చిత్రంను అంత భారీ బడ్జెట్‌తో నిర్మించడం అనేది చాలా ప్రమాదం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.రవితేజ ఫిల్మ్‌ గ్రాఫ్‌ ప్రస్తుతం కింది కిందకు వెళ్తుంది.ఇలాంటి సమయంలో ఆయనపై ఎంత ఎక్కువ పెడితే అంత రిస్క్‌ అనే విషయాన్ని దర్శక నిర్మాతలు గుర్తించక పోవడం వల్లే ‘డిస్కోరాజా’ చిత్రం బడ్జెట్‌ చేతులు దాటి పోయిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా పాయల్‌ రాజ్‌ పూత్‌ నటిస్తోంది.ఇటీవలే విడుదలైన రవితేజ డిస్కోరాజా లుక్‌కు పర్వాలేదు అన్న టాక్‌ వచ్చింది.ఇక సినిమాను ముగించే పనిలో దర్శకుడు ఉన్నాడు.ప్రస్తుతం సినిమా చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.చాలా కాలంగా సక్సెస్‌ మొహం ఎరుగని రవితేజ ఈ చిత్రంతో ఖచ్చితంగా సక్సెస్‌ కొట్టాలనే పట్టుదలతో నిర్మాతలపై ఒత్తిడి తీసుకు వచ్చి బడ్జెట్‌ కాస్త ఎక్కువే పెట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరి ఈ చిత్రం ఫలితం తేడా కొడితే నిర్మాత పరిస్థితి ఏంటో.?