యశ్ కోసం క్యూ కట్టిన మహిళలు.. ఎక్కడో తెలుసా?  

Huge Women Fans Visit Falaknuma Palace To See Yash - Telugu Falaknuma Palace, Kgf, Kgf2, Shooting, Telugu Movie News, Yash

కన్నడలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఈ సినిమాతో హీరో యశ్ ఓవర్‌నైట్ స్టార్‌డమ్ కొట్టేశాడు.

Huge Women Fans Visit Falaknuma Palace To See Yash

పవర్‌ఫుల్ మూవీగా తెరెకెక్కిన కేజీఎఫ్ చిత్రంతో ఈ హీరో తెలుగు, హిందీ భాషల్లో కూడా అభిమానులను సంపాధించుకున్నాడు.కాగా ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

కాగా రీసెంట్‌గా కేజీఎఫ్ 2 చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతోంది.

ఈ విషయం తెలుసుకున్న కొందరు మహిళా అభిమానులు, యశ్‌ను చూసేందుకు అక్కడికి పెద్ద సంఖ్యంలో చేరుకున్నారు.అయితే ఈ ప్యాలెస్‌ను ఇటీవల హోటల్‌గా మార్చడంతో అక్కడికి భోజనం చేసేందుకని చేయడానికి వచ్చిన మహిళలు, యశ్‌ను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.

మొత్తానికి యశ్‌కు కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనడానికి ఇదొక నిదర్శనం అంటున్నారు కన్నడ అభిమానులు.ఇక కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Huge Women Fans Visit Falaknuma Palace To See Yash Related Telugu News,Photos/Pics,Images..

footer-test