రామాలయం కొరకు భారీ పొడవైన కేక్..!

రామ మందిర నిర్మాణానికి దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ఇటుక వేయడంతో రామ మందిర నిర్మాణానికి ముందడుగు వేసిన సంగతి అందరికి తెలిసిందే.

 Huge Tall Cake For Ramalayam , Rama Mandir, Rama Shethu, 48 Feets , Cake, Bakery-TeluguStop.com

మనం ఇచ్చే విరాళం రామ మందిర నిర్మాణానికి ఒక్క ఇటుక అందిస్తునట్లుగా నరేంద్ర మోదీ చెప్పారు.ఇక అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కొందరు రామ మందిరంపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు.అయితే ఏం చేశాడు అని అనుకుంటున్నారా.? అయితే ఈ వార్త చదివేయండి.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.

గుజరాత్‌ లోని బ్రెడ్ లైనర్ బేకరీ రామునిపై తమ భక్తుని చాటుకునేలా ఓ కార్యక్రమాన్ని రూపొందించింది.ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు “హర్ కదమ్ రామ్ కే నామ్ సంకల్ప్ అభియాన్” పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు.

అయితే ఇందులో భాగంగా రామసేతును ప్రతిబింబించేలా 48 అడుగుల పొడవైన కేకును రూపొందించింది.ఈ సందర్భంగా బ్రెడ్ లైనర్ నిర్వాహకులు నితిన్ భాయి మాట్లాడుతూ “రాముడు అంటే విశ్వాసం, ప్రేమ, వీరత్వం, మతం.అందుకే ప్రస్తుతం రాముని జన్మస్థలంలో దివ్యమైన రామాలయం నిర్మాణం జరుగుతోంది” అని అన్నారు.

ఇక, ఈ కేకు పై శ్రీరాముని 16 సద్గుణాలు రాసినట్టు బేకరి నిర్వాహకులు తెలిపారు.

వాటిలో ఏదైనా ఒకదానిని స్వీకరించి.అందుకు సంబంధించిన ప్రతిజ్ఞ పంపాలని రామ భక్తులకు పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 16 లోపు ప్రతిజ్ఞ వీడియో పంపిన మొదటి 1,084 మందికి 400 గ్రాముల రామ సేతు కేక్ ఉచితంగా ఇవ్వనున్నట్టు బేకరి నిర్వాహకులు పేర్కొన్నారు.అంతేకాకుండా రామాలయ నిర్మాణం కోసం బ్రెడ్ లైనర్ బేకరీ సిబ్బంది తమ ఒక రోజు వేతనం రూ.1,11,111 రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube