ఏపీలోని ఆ ప్రాంతంలో బ్లాక్ బస్టర్ సినిమాలు రీరిలీజ్ కావట.. కారణమేంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాను పూర్తి చేసి ఆ సినిమాను రిలీజ్ చేయడానికి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతోంది.అందువల్ల హీరోల పుట్టినరోజు సందర్భంగా కూడా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదు.

 Huge Shock To Pawan Kalyan Fans And Chiranjeevi Fans Details Here Goes Viral , P-TeluguStop.com

అందువల్ల ఫ్యాన్స్ తన ఫేవరెట్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఏపీలోని పలు ప్రాంతాల్లో పోకిరి మూవీ రీరిలీజ్ అయిందనే సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లోకి పోకిరి సినిమాలో రీరిలీజ్ కాగా వందల సంఖ్యలో షోలు ప్రదర్శితమయ్యాయి.అయితే కాకినాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.కాకినాడలో ఇకపై అందరు హీరోల బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు రద్దు కానున్నాయి.ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడిందనే సంగతి తెలిసిందే.

పోకిరి రీరిలీజ్ సమయంలో పలు థియేటర్లలో ప్రాపర్టీ డ్యామేజ్ అయిందని సమాచారం.

కాకినాడలో కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోని థియేటర్లలో ఈ నిబంధనలు అమలు కానున్నాయి.

థియేటర్ల యజమానులలో ఎవరైనా నిబంధనలను అతిక్రమించితే లక్ష రూపాయల ఫైన్ విధిస్తారని సమాచారం అందుతోంది.మెగాస్టార్ 67వ పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు, ఇంద్ర సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.

Telugu Benefit Shows, Kakinada-Movie

సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.మెగా హీరోల సినిమాల రీరిలీజ్ సమయంలోనే బ్యాన్ విధించడంపై కొందరు ఫ్యాన్స్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ప్రాపర్టీ డ్యామేజ్ చేయకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సినిమాలనే రీరిలీజ్ చేయకపోవడం ఏంటని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఎగ్జిబిటర్లు బ్యాన్ ను ఎత్తివేయాలని మెగా హీరోల అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.

పవన్, చిరంజీవి ఫ్యాన్స్ ఎగ్జిబిటర్ల నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube