ఇండ్ల‌మ‌ధ్య వ‌ర‌ద‌ల్లో క‌దులుతున్న భారీ ఆకారం.. ఏంటో చూస్తే ఫ్యూజులు ఔట్‌

ఈ మ‌ధ్య కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు దేశంలోని చాలా న‌గ‌రాలు వ‌ర‌దల్లో నీట మునిగాయి.రోడ్లన్నీ జలమయమవుతున్నాయి.

 Huge Shape Moving In The Middle Of The House If You Look At The Fuses Out-TeluguStop.com

ఇక ఈ వ‌ర‌ద నీళ్ల‌లో ఇండ్ల ముందుకు పెద్ద పెద్ద వ‌స్తువులు కూడా కొట్టుకు వ‌స్తున్నాయి.ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే స‌ముద్రంలో ఉండాల్సిన జంతువులు కూడా ఇండ్ల‌ముందు ద‌ర్శ‌నం కూడా ఇచ్చాయి.

ఇక ఇప్పుడు కూడా ఓ ప్రాంతంలో ఇలాగే వర్షాలు కుర‌వ‌గా ఆ వీధుల్లోకి అనుకోకుండా వ‌ర‌ద‌ల్లో ఏదో భారీ ఆకారం వ‌చ్చింది.అయితే అదేంటా అని అంద‌రూ ఆ నీటిలో వ‌ల వేసి చూడ‌గా ఒక్కసారి గుండె ఆగినంత ప‌నైంది.

 Huge Shape Moving In The Middle Of The House If You Look At The Fuses Out-ఇండ్ల‌మ‌ధ్య వ‌ర‌ద‌ల్లో క‌దులుతున్న భారీ ఆకారం.. ఏంటో చూస్తే ఫ్యూజులు ఔట్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే అందులో నుంచి ఓ పెద్ద మొసలి బయటకురావ‌డం సంచ‌ల‌నం రేపింది.కాగా ఈ అనూహ్య ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో జ‌రిగింది.సోషల్ మీడియాలో ఈ మొస‌లి వీడియో ఇప్పుడు పెద్ద ట్రెండింగ్ గా మారిందంటే న‌మ్మండి.మామూలుగానే జంతువుల‌కు సంబంధించిన ఇలాంటి వీడియోలు బాగా వైర‌ల్ అవుతుంటాయి.

అలాంటిది ఇండ్ల మ‌ధ్య‌కు ఇలాంటి మొస‌లి వ‌స్తే ఇంకేమైనా ఉందా.కాగా ఇప్పుడు వ‌డోద‌రాలో భారీగా వ‌ర్షాలు కురవడంతో ప‌ట్ట‌ణంలోని ఓ రోడ్డు మొత్ం మొత్తం చెరువులా మారిపోయంది.

అయితే ఈ వ‌ర‌ద నీటిలో ఓ మొస‌లి కొట్టుకు వ‌చ్చి ఎంచక్కా అక్కడే ఉంటోంది.దీంతో దాన్ని గ‌మ‌నించిన వారు పట్టుకోవడానికి ప్రయత్నించారు.ఇక ఓ ఇద్దరు యువ‌కులు ఇందుకు సాహసించి ఆ మొసలిని నెమ్మ‌దిగా కర్రతో బెదిరించి ఎలాగోలా క‌ష్ట‌ప‌డి మ‌రీ వలలో ఇరుక్కునేలా చేశారు.ఇక దీన్నంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌గా ఈజీగానే వైర‌ల్ అయిపోయింది.

ఇప్పటికే ఈ వీడియోను 41 వేలమందికి పైగా చూశారు.వ‌ర‌ద‌ల స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ సూచిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ వీడియోకు లైకులు, కామెంట్స్ వ‌ర్షం కురుస్తోంది.

#Crocodile #Floods #HugeShape

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు