నాచురల్ స్టార్ నాని మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్న చిత్రం దసరా.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని పాన్ ఇండియా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించి ఉండగా కొద్దిరోజులుగా షూటింగ్ కి విరామం ఇచ్చారు.
తాజాగా ఈ సినిమా ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ నేడు హైదరాబాదులో ప్రారంభమైంది.ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాదులో భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నాని ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్ లో సందడి చేయనున్నారు.అలాగే ఈ సినిమాలో నాని పూర్తిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు.
ఈ భారీ షెడ్యూల్ చిత్రీకరణలో మొత్తం ప్రధాన తారాగణం పై షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాని గోదావరి ఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో తెరకెక్కుతోంది.ఇన్ని రోజులు నాని క్లాస్ లుక్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.అయితే మొదటిసారిగా ఇలా మాస్ లుక్ లో సందడి చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది.అయితే నాని నటించిన అంటే సుందరానికి సినిమా ప్రమోషన్, విడుదల కార్యక్రమాలలో బిజీగా ఉండటం వల్ల కొద్ది రోజులపాటు ఈ సినిమాకి విరామం ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలకు డైరెక్ట్ శ్రీకాంత్ తనదైన శైలిలో చెక్ పెట్టారు.
ఇక నేడు ఈ సినిమా షూటింగ్ యధావిధిగా పునః ప్రారంభమైంది.