బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ టీజ‌ర్ కి అనూహ్య స్పంద‌న,

బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ టీజ‌ర్ కి అనూహ్య స్పంద‌న, ఏప్రిల్ 10న వైజాగ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌


 Huge Response To Sarainodu Blockbuster Song-TeluguStop.com

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు.తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

ఏప్రిల్ 10న విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేస్తున్నారు.ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

ఈ రోజు విడుద‌ల‌యిన హీరోయిన్ అంజ‌లి తో అల్లు అర్జున్ స్టెప్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే లిరిక్ తో వ‌చ్చే సాంగ్ టీజ‌ర్ కు అభిమానుల నుండి మ‌రియు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్య స్పంద‌న వస్తుంది.ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో నేషనల్ లెవెల్ లో సైతం ట్రెండ్ కావడం విశేషం

యాక్ష‌న్‌ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన‌ ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ….

ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఇప్పుడు విడుద‌ల చేసిన హీరోయిన్ అంజ‌లి, అల్లు అర్జున్ మెస్మ‌రైజింగ్ స్టెప్ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే లిరిక్ తో వ‌చ్చే సాంగ్ టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంది.

అన్ని సాంగ్స్ ఆరేంజ్ లోనే థ‌మ‌న్ అందించాడు.ఈ ఆడియోని ఏప్రిల్ 1న డైరెక్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేసి, ఏప్రిల్ 10న విశాఖ‌ప‌ట్నం లో గ్రాండ్‌ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాము.

ఇప్ప‌టికే దాదాపు అన్ని కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌స‌రైనోడు చిత్రం ఈ స‌మ్మ‌ర్ లో అంద‌రిని అక‌ట్టుకుంటుంది.అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సరైనోడు చిత్రంపై ఉన్న భారీ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతాం.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన పాటలు కంపోజ్ చేశాడు.ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం.అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను.

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.అని అన్నారు

నటీనటులు అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)


సాంకేతిక వర్గం

బ్యానర్ –

గీతా ఆర్ట్స్

ప్రొడక్షన్ కంట్రోలర్స్ –

బాబు, యోగానంద్

చీఫ్ కోఆర్డినేటర్ –

కుర్రా రంగారావ్

ఆర్ట్ డైరెక్టర్ –

సాహి సురేష్

ప్రొడక్షన్ డిజైనర్ –

రాజీవన్

ఎడిటింగ్ –

కోటగిరి వెంకటేశ్వర రావ్

ఫైట్ మాస్టర్స్ –

రామ్ లక్ష్మణ్, రవి వర్మ

డిఓపి –

రిషి పంజాబి

డైలాగ్స్ –

ఎం.రత్నం

మ్యూజిక్ –

ఎస్ ఎస్ తమన్

కో ప్రొడ్యూసర్ –

శానం నాగ అశోక్ కుమార్

ప్రొడ్యూసర్ –

అల్లు అరవింద్

డైరెక్టర్ –

బోయపాటి శ్రీను

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube