బేబీ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్...

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Deverakond ) హీరోగా వైష్ణవి హీరోయిన్ గా వస్తున్న సినిమా బేబీ( Baby movie )ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి సిద్ధం అవుతుంది….ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వస్తుంది…

పాటలు రిలీజ్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా ట్రేడ్ లో కూడా సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మరింతగా రచ్చ చేసింది.

ప్రజెంట్ జనరేషన్ యూత్ కి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యే….స్టోరీ పాయింట్ తో వచ్చిన బేబి మూవీ ఎలాంటి యాడ్స్ లాంటివి లేకుండా జెన్యూన్ గా ట్రైలర్ కి మంచి రీచ్ సొంతం అవ్వగా 24 గంటల్లో ఈ ట్రైలర్ కి 3.19 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 128.8K లైక్స్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది….

ఓ చిన్న సినిమా ట్రైలర్ కి ఇలాంటి రెస్పాన్స్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.ఓవరాల్ గా రెస్పాన్స్ బాగుండటంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కూడా ఈ సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.ఇక ఈ సినిమా ఆనంద్ హీరోగా వైష్ణవి( Vaishnavi Chaitanya) హీరోయిన్ గా ఇండస్ట్రీ లో సెటిల్ అవ్వడం పక్క అని సిని పెద్దలు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా కనక మంచి హిట్ అయితే ఇక ఆనంద్ కూడా విజయ్ లానే ఒక మంచి హీరోగా గుర్తింపు పొందుతాడు.అలాగే ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు అన్నతమ్ముడు కూడా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతారు.

Advertisement

అందుకే విజయ్ కూడా ఈ సినిమా తో వాళ్ల తమ్ముడుని హీరోగా నిలబెట్టలని చూస్తున్నాడు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు