వేట మొదలుపెట్టిన సర్కారు వారి పాట  

Huge Price For Sarkaru Vaari Paata Digital And Satellite Rights, Mahesh Babu, Sarkaru Vaari Paata, Parasruam, Digital Rights, Satellite Rights - Telugu @maheshbabunews, Digital Rights, Mahesh Babu, Parasruam, Sarkaru Vaari Paata, Satellite Rights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమాకు వారు భారీ విజయాన్ని అందించారు.

TeluguStop.com - Huge Price For Sarkaru Vaari Paata Digital And Satellite Rights

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అయ్యాడు.ఇప్పటికే దర్శకుడు పరశురామ్‌తో కలిసి ‘సర్కారు వారి పాట’ను తన నెక్ట్స్ మూవీగా అనౌన్స్ కూడా చేశాడు.
ఇక ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనుండటంతో, ఈ సినిమా ఎలాంటి రికార్డులకు తెరలేపుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

TeluguStop.com - వేట మొదలుపెట్టిన సర్కారు వారి పాట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆలస్యం అవుతుండటంతో, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఎవ్వరి ఊహలకు అందకుండా ఈ సినిమా అప్పుడే బిజినెస్ కూడా జరుపుతుండటంతో చిత్ర వర్గాలు అవాక్కవుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటిల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్‌ను ఏకంగా రూ.35 కోట్ల భారీ ఆఫర్‌కు ముగించినట్లు తెలుస్తోంది.ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలవకుండానే, ఇంత భారీ మొత్తంలో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడు కావడం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీ క్రిటిక్స్.ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా మొదలుపెట్టి, అంతే త్వరగా ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

#SarkaruVaari #Digital Rights #Parasruam #Mahesh Babu #@MaheshBabuNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Huge Price For Sarkaru Vaari Paata Digital And Satellite Rights Related Telugu News,Photos/Pics,Images..