కేసీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కు భారీ మైలేజ్... అసలు వ్యూహం ఇదే

ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కుతోంది.ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల సమరం మొదలైన ప్రస్తుత పరిస్థితులలో ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యూహ ప్రతి వ్యూహాలలో నిమగ్నమైన పరిస్థితి ఉంది.

 Huge Mileage For Trs With Kcr Comments This Is The Real Strategy Kcr, Trs Party-TeluguStop.com

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న పరిస్థితులలో టీఆర్ఎస్ కు బీజేపీకు సమాన గెలుపు అవకాశాలు ఉన్నాయనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కెసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా టీఆర్ఎస్ కు భారీ మైలేజ్ వచ్చిన పరిస్థితి ఉంది.

కెసీఆర్ మాట్లాడుతూ వచ్చే రెండు నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తామని  70 వేల నుండి 80 వేల వరకు ఉద్యోగాలు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు దక్కనున్నాయని తెలిపారు.

Telugu @cm_kcr, @ktrtrs, Huzurabad, Telangana-Political

దీంతో ఒక్కసారిగా ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల ఆలస్యంతో అగ్రహంగా ఉన్న నిరుద్యోగుల ఆగ్రహం చల్లారినట్టయింది.  అంతేకాక తెలంగాణలో దళిత బంధును వచ్చే మార్చి నెల వరకు తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు అందుతుందని కెసీఆర్  తెలిపిన సందర్భం ఉంది.ఈ వ్యాఖ్యలతో మిగతా నియోజకవర్గాలలో దళిత బంధు ఆశిస్తున్న దళితులకు సమాధానం ఇచ్చినట్టయింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు కావలిసింది పాజిటివ్ మైలేజ్.అయితే ప్రస్తుతం ఏదైతే ప్రతిపక్షాలు తమ ప్రచారాలతో ప్రభుత్వం పై వ్యతిరేకతను ఎంతో కొంత క్రియేట్ చేయగలిగారో అదంతా పోయి కెసీఆర్ కు అనుకూలంగా మారిన పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా ప్రతిపక్షాలను కెసీఆర్ అదును చూసి దెబ్బకొట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా రోజుల్లో కెసీఆర్ వ్యూహం ఎంత మేరకు టీఆర్ఎస్ ను మరల అధికారంలోకి తీసుకరావడంలో దోహదపడుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube