హీరోను అయ్యగారిగా మార్చిన ఫ్యాన్.. ఆ ఫ్యాన్ కే పెరిగిన ఫాలోయింగ్

Huge Following For Akhil Ayyagaru Fan

హీరోలు అన్న తర్వాత ఫ్యాన్ ఉండటం మామూలే.కాకపోతే కొందరికి ఎక్కువ ఉంటారు.

 Huge Following For Akhil Ayyagaru Fan-TeluguStop.com

మరి కొందరికి తక్కువగా ఉంటారు.కానీ ఫ్యాన్కే ఫాలోయింగ్ ఉండటం ఎప్పుడైనా చూశారా? మీరు విన్నది నిజమేనండి.ఒక హీరోకి అతడు ఫ్యాన్.ఫ్యాన్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది.మరి ఆ హీరో ఎవరు? ఆ ఫాలోయింగ్ ఉన్న ఫ్యాన్ ఎవరో ఎంటో తెలుసుకుందాం.

అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుగు ఆడియన్స్‌కు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

 Huge Following For Akhil Ayyagaru Fan-హీరోను అయ్యగారిగా మార్చిన ఫ్యాన్.. ఆ ఫ్యాన్ కే పెరిగిన ఫాలోయింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగేశ్వర్ రావు మొదలుకుని అఖిల్ వరకు అందరూ ఇండస్ట్రీకి చెందిన వారే.ఇందులో అఖిల్‌కు గుంటూరులో ఒక ఫ్యాన్ ఉన్నాడు.

అతని పేరు నాగరాజు.చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలంటే ఇంట్రెస్ట్.

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చిందంటే అతనికి పండగే.ఆ సినిమాను ఎన్ని సార్లు చూస్తాడో అతడికే తెలియదు.

నాగార్జున మూవీ రిలీజ్ అయిందటే ఈ ఫ్యాన్. థియేటర్ దగ్గర కింగ్.కింగ్. అంటూ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

రాజుగారి గది 2 మూవీని చూసిన నాగరాజు.సినిమా నచ్చకపోవడంతో డిసప్పాయింట్ అయిన నాగరాజు.

ఆ టైంలో వచ్చిన ఫ్రస్టేషన్‌తో అఖిల్ గురించి మాట్లాడాడు.అఖిల్ రావాలని, ఆయనే నంబర్ వన్.అయ్యగారు రావాల్సిందేనని థియేటర్ ఎదుట నానా హంగామా చేశాడు. 

నాగరాజు కామెంట్స్‌కు సంబంధించిన వీడియో అప్పట్లో పాపులర్ అవ్వడంతో పాటుగా.చాలా మంది అఖిల్‌ను ‘అయ్యగారు’ అంటూ ట్రోల్ చేశారు. అక్కినేని ఫ్యామిలో సినిమా రిలీజ్ అయితే సందడి చేసే ఈ ఫ్యాన్.

తన పాపులారిటీని వాడుకోవడం సైతం తనకి తెలియదు.ఎంతో నిస్వార్ధంగా అక్కినేని కుటుంబాన్ని అభిమానిస్తూ ఉన్నాడు.

అయితే.నాగరాజు గురించి తాజాగా అఖిల్ సైతం స్పందించారు.

తనకంటే తన ఫ్యాన్కే ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం గర్వంగా ఉందని తెలిపారు.అతన్ని కంపల్సరీగా మీట్ అవుతానంటూ చెప్పొకొచ్చాడు.

ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఎంత పెరుగుతుందో, అతన్ని అఖిల్ కలుస్తాడో లేడో చూడాలి మరి.

#Nagaraju #HugeAkhil #Akhil Akkineni #Akhil #Ayyagaru Fan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube