జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.సస్పెన్స్ కెమికల్ ల్యాబ్ లో బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది.ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పారిశ్రామిక వాడ కావడంతో ఇటీవల ఎక్కువగా ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు రోజు రోజుకీ పెరిగిపోతున్న పరిస్థితి.
మొదటిసారి పేలుడు సంభవించిన టైములో వంటలు తక్కువ టైంలో అదుపులోకి రాగా రెండోసారి మరోసారి పేలుడు సంభవించినట్లు సమాచారం.దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.10 రియాక్టర్లలో 4 రియాక్టర్లు పేలడంతో.ఇంత పెద్ద ప్రమాదం సంభవించినట్లు అక్కడ ఉన్న వారు చెబుతున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది ఫ్యాక్టరీ లో ఉండగా 40 మంది బయటకు రాగా పదిమంది చిక్కుకున్న వారిలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో… క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.