కోల్గేట్ సంస్థకు భారీ జరిమానా.. కారణం?

మనం ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించే టూత్ పేస్ట్ కోల్గేట్.100 కి 75 పర్సెంట్ పీపుల్ ఉపయోగించే టూత్ పేస్ట్ కోల్గేట్.ఈ కోల్గేట్ యాడ్ గురించి మనము టీవీలో పేపర్లలో ప్రకటనలు చూస్తూ ఉంటాం.ఈ కోల్గేట్ సంస్థ పైన కేసు వేసారు.కేసు వేసి దానికి పరిహారం కూడా చెల్లించారు.ఈ విషయం గురించి ఇప్పుడు మరింత తెలుసుకుందాం.

 Huge Fine, Colgate Company, Case, Customers, Return 17 Rs Money-collggate-20gram-TeluguStop.com

ఇక విషయంలోకి వెళితే న్యాయ న్యాయవాదిగా పనిచేస్తున్న సిహెచ్ నాగేందర్ 2019 ఏప్రిల్ 7న సంగారెడ్డి పట్టణంలోనే రిలయన్స్ ఫ్రెష్ రిటైలర్ మాల్ కు వెళ్ళాడు.అప్పుడు నాగేందర్ 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ ఇవ్వమని అడిగాడు.

పేస్ట్ ఇచ్చిన షాప్ అతను 92 రూపాయలు తీసుకున్నాడు.దానితోపాటు 20 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ పది రూపాయలకు కొనుగోలు చేశాడు.

పది రూపాయలకు 20 గ్రాముల చొప్పున అమ్మితే 150 గ్రాములకు 75 రూపాయలు అవుతుంది.కానీ 150 గ్రాముల పేస్ట్ కు 92 రూపాయలు తీసుకున్నారు.17 రూపాయలు ఎక్కువ ఎందుకు తీసుకున్నారు అంటూ అతను కోల్గేట్ సంస్థలకు నోటీసులు రాశారు.సంస్థ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో నాగేందర్ సంగారెడ్డి లో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

Telugu Colgate Company, Customers, Fine, Return Rs-General-Telugu

కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోల్గేట్ సంస్థ వినియోగదారుని 17 రూపాయలు వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఆయనను మానసిక క్షోభకు గురి చేసినందుకు అదనంగా 10 వేలు మరియు ఖర్చుల కింద మరో 5 వేలు ఇవ్వాలని వినియోగదారుల ఫోరం చైర్మన్ పి.కస్తూరి సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు చెప్పారు.వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా మరో 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థ ను ఆదేశించారు.

ఇవన్నీ నెలరోజుల లోపు వినియోగదారుడు నాగేంద్ర కు చెల్లించాలని సూచించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube