పోలీసులే లక్ష్యంగా పాక్ లో భారీ పేలుడు  

Huge Explosion In Pakistan-

ఇటీవల శ్రీలంక లో వరుస పేలుళ్లు సంభవించడం తో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇంకా ఆ ఘటన మరువక ముందే పోరుగుదేశం పాకిస్థాన్ లో కూడా భారీ పేలుడు సంభవించింది.

Huge Explosion In Pakistan--Huge Explosion In Pakistan-

పాక్ లోని లాహోర్ లో బుధవారం ఈ పేలుడు ఘటన చోటుచేసుకుంది.లాహోర్ లోని సూఫీ ప్రార్ధనా మందిరం దాతా దర్బార్ రెండో గేటు వద్ద ఈ పేలుడు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.లాహోర్లోని సూఫీ ప్రార్థనా మందిరం దాతా దర్బార్ వద్ద బాంబు పేలింది.ఈ ఘటనలో ఎనిమిది మృతిచెందగా.24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.అయితే ఆ గేటు సమీపంలో రెండు పోలీసు వాహనాలు కూడా ఉండడం తో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 3 గురు పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.అయితే గాయపడిన వారిలో మరో 8 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

బుధవారం ఉదయం 8:45 నిమిషాలకు ఈ పేలుడు చోటుచేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులు బలగాలను మోహరించి సహాయక చెర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.

అయితే పోలీసులే లక్ష్యంగా ఈ పేలుడు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ అయ్యాయి.మొన్న శ్రీలంక లో జరిగిన వరుస పేలుళ్ల ఘటన లో వందల మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.దీనితో రెండు వారాల పాటు అక్కడ అన్నీ పాఠశాల లు,కళాశాల లను మూసివేశారు.

అలానే సోషల్ మీడియా పైన కూడా బ్యాన్ విధించారు.