కళ్యాణ్ రామ్ 'బింబిసారా' అయితే బాహుబలి.. లేదంటే ఆడియెన్స్ బలి..!

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా వశిష్ట డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ బింబిసారా.బాహుబలి రేంజ్ లో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో షాక్ ఇచ్చారు చిత్రయూనిట్.ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడి విజయ గర్వంతో చూస్తున్న కళ్యాణ్ రాం పోస్టర్ బింబిసారా సినిమాపై అంచనాలు పెంచాయి.

 Huge Expectations On Kalyan Ram Bimbisara Movie , Bimbisara Kalyan Ram, Bimbisar-TeluguStop.com

అయితే కళ్యాణ్ రాం ఎప్పుడు రిస్క్ చేసేందుకు ఇష్టపడతాడు.

కెరియర్ లో హిట్లు ఫ్లాపులు సమతూకం చేసుకుంటూ వెళ్తున్న ఈ నందమూరి హీరో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఓ ప్రయత్నం చేయడం షాకింగ్ గానే అనిపిస్తుంది.

అదికూడా పిరియాడికల్ మూవీగా బింబిసారా ప్రయత్నం చాలా గొప్ప విషయం.ఈ సినిమా క్రీస్తుపూర్వం 5వ శతాబ్ధానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది.

చూస్తుంటే బాహుబలి సినిమా రేంజ్ లో సెట్టింగులు.యుద్ధాలు ఉండేలా ఉన్నాయి.

అయితే సినిమా కథ బాగున్నా టేకింగ్ లో రాజమౌళి లెక్క వేరేలా ఉంటుంది.మరి కళ్యాణ్ రాం బింబిసారా మరో బాహుబలి అవుతుందా అంచనాలను అందుకోక ఆడియెన్స్ ను బలి చేస్తుందా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పగలం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube