మండే టెస్టు పోయింది రమణా..!  

Huge Drop In Sarileru Neekevvaru Monday Collections-mahesh Babu,rashmika Mandanna,sarileru Neekevvaru,sln Collections

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో సినిమాను చేసేందుకు జనాలు ఎగబడ్డారు.

Huge Drop In Sarileru Neekevvaru Monday Collections-Mahesh Babu Rashmika Mandanna Sarileru Sln Collections

ఇక సంక్రాంతి సెలవులు కూడా రావడంతో ఎక్కడ చూసినా హౌజ్‌ఫుల్ బోర్డులు కనిపించాయి.

అయితే ఈ జోరు సెలవులు ముగిసే వరకు కొనసాగింది.

కాగా సెలవులు ముగియడంతో ఈ సినిమా కలెక్షన్లు సోమవారం నాడు భారీగా తగ్గినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.రిలీజ్ అయ్యి 10 రోజులు కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పోయిందని, మరోవైపు అల వైకుంఠపురములో సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మహేష్ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది.

కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో కథలో దమ్ములేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.సంక్రాంతి సెలవుల పుణ్యమా అని ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయని వారు అంటున్నారు.

ముఖ్యంగా మండే టెస్టులో సరిలేరు నీకెవ్వరు థియేటర్లలో సగానికి సగం ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయట.ఈ లెక్కన వీక్ డేస్‌లో కలెక్షన్లు మరింత డ్రాప్ అవుతాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అటు ఓవర్సీస్‌లో అల వైకుంఠపురములో సినిమా దూసుకుపోతుండటంతో సరిలేరు నీకెవ్వరు చిత్రం చతికలపడింది.మరి టోటల్ రన్‌లో ఈ సినిమా ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు

Huge Drop In Sarileru Neekevvaru Monday Collections-mahesh Babu,rashmika Mandanna,sarileru Neekevvaru,sln Collections Related....