నోకియా ఫోన్ల పై భారీగా తగ్గింపు.... పండగ చూసుకోండి...  

Huge Discount On Nokia Phones-flipkart,nokia,nokia Phones,nokia Phones 6.1,nokia Phones 7.2,nokia Phones Discount

ఒకప్పుడు మొబైల్ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలుగొందినటువంటి నోకియా మొబైల్ సంస్థ ప్రస్తుతం ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ సంస్థల పోటీని తట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.అంతేగాక ఒకప్పుడు అన్ని మొబైల్ సంస్థలు ఆండ్రాయిడ్ వెర్షన్ తో వస్తోంటే నోకియా మాత్రం విండోస్ మొబైల్ తయారు చేసి మార్కెట్లోకి లాంచ్ చేసింది.

Huge Discount On Nokia Phones-Flipkart Nokia Phones 6.1 7.2

 అయితే ఈ విండోస్ మొబైల్ సరిగా క్లిక్ కాకపోవడంతో నష్టాల బాట పట్టింది.అయితే ఆ తర్వాత కొద్ది రోజులు మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి మళ్లీ విండోస్ మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.అంతేగాక కొంతమంది వినియోగదారులు రానురాను నోకియా ఫోన్ పై నమ్మకం పోగొట్టుకోవడంతో వినియోగదారులు ఇతర సంస్థల మొబైల్ ఫోన్ల పై మొగ్గు చూపారు.

దీంతో చేసేదేమీ లేక నోకియా వినియోగదారులు కనుగుణంగా మళ్లీ ఆండ్రాయిడ్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది.అయితే వచ్చీరావడంతోనే ఆండ్రాయిడ్ వర్షన్ కంటే కొంచెం మెరుగ్గా ఫలితాలు ఇచ్చేటువంటి ఆండ్రాయిడ్ వన్ వర్షంతో నోకియా మార్కెట్లోకి వచ్చింది.

దీంతో నోకియా మంచి ఆదరణ పొందింది.అయితే తాజాగా ఈ సంస్థకు సంబంధించి నటువంటి నోకియా 7.2, నోకియా 6.2 మొబైల్ ఫోన్ల పై 3500/- భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.అంతేగాక ఈ ధరలను  అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ వెబ్సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచింది.

అయితే నోకియా 7.2 ఫోన్ విడుదల చేసినప్పుడు దీని ధర అ 18,599 రూపాయలుగా ఉంది.అయితే ప్రస్తుతం ఈ ఫోన్ పై రాయితీ ప్రకటించడం వలన 15,499 గా ఉంది.అలాగే 6.2 ఫోన్ ధర కూడా అప్పట్లో 15999 రూపాయలు ఉండగా ప్రస్తుతం 12,499 రూపాయలు గా ఉంది.అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఫీచర్ల విషయంలో కూడా ఎందులోనూ తీసిపోవు .కాబట్టి స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ప్రస్తుతం నోకియా ఫోన్ మంచి ఆప్షన్ గా ఉంటుంది.

తాజా వార్తలు