పుల‌స చేప‌ల‌కు భారీ డిమాండ్‌.. ఒక్క చేప ఎంతో తెలిస్తే షాక్‌!

ఏ వంట‌కాన్ని అయినా ఇట్టే కొట్టేది చేప మాత్ర‌మే.నోట్లో వేసుకోగానే ఎంతో టేస్టీగా ఇట్టే క‌రిగిపోతుంటుంది చేప ఆహారం.

 Huge Demand Pulasa Fish Cost Godavari-TeluguStop.com

అయితే చేప‌ల్లో కూడా చాలా ర‌కాలున్నాయి.ఇందులో మ‌రీ ముఖ్యంగా పులస చేప అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేద‌నే చెప్పాలి.

అలా నాటి నుంచి ఇప్ప‌టి దాకా దీనికి ఉన్న డిమాండ్ వేరే అని చెప్పాలి.అనాది నుంచి పుస్తలు అమ్మైనా సరే పులస చేప వంట‌కాన్ని తినాలనే సామెత దీని కోస‌మే స్పెష‌ల్ గా రాశారంటే దీనికి ఉన్న ప్రాధాన్య‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

 Huge Demand Pulasa Fish Cost Godavari-పుల‌స చేప‌ల‌కు భారీ డిమాండ్‌.. ఒక్క చేప ఎంతో తెలిస్తే షాక్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవ‌లం ఈ చేప కోస‌మే వేల కిలోమీటర్ల నుంచి ప్ర‌యాణం చేస్తూ వ‌స్తుంటారు భోజ‌న ప్రియులు.
అయితే ఈ చేపకు నీటికి ఎదురీదే లక్షణమున్న ఏకైక చేపగా పేరు గాంచింద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

అస‌లు ఈ చేప ఏకంగా సముద్రం నీళ్ల నుంచి రివర్స్‌గా గోదావరిలోకి ఈదుతూ ప్రవేశించే ఈ పులస చేప‌ల రుచికి దాసోహం కాని వారంటూ ఉండ‌రేమో మ‌రి.అయితే ఇప్పుడు మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోని గోదావ‌రిలో మాత్ర‌మే ల‌భించే ఈ పులస చేపల కోసం ఇప్పుడు వేలం పాట‌లు న‌డుస్తున్నాయి.

దీంతో వీటిని దక్కించుకునేందుకు జనాలు క్యూ కడుతున్నారంట‌.ప్ర‌స్తుతం మార్కెట్లో ఈ పుల‌స చేప‌ల సందడి న‌డుస్తోంది.

ఎలాగైనా ఈ పులస చేప‌ల‌ను సొంతం చేసుకునేందుకు జనాలు అమాంతం క‌రోనాను కూడా లెక్క చేయ‌కుండా పోటీపడుతున్నారు.ఒక్కో చేప‌కు వేల రూపాయలను ఖ‌ర్చు చేస్తూ ద‌క్కించుకుంటున్నారు.ఇక రీసెంట్ గా యానం మార్కెట్‌లో ఈ పులస వేలం నిర్వహించగా ఓ జాలరికి దొరికిన‌ చేప ఏకంగా రికార్డు ధ‌ర ప‌లికింది.మొద‌ట ఈ చేపను నిర్వాహ‌కులు.30 వేల నుంచి వేలంపాట ప్రారంభించ‌గా.ఆ త‌ర్వాత రేటు తగ్గించుకుంటూ రావ‌డంతో లాస్ట్ కు రూ.17 వేలు ప‌లికింది.ఒక్క చేప ఈ స్థాయిలో ప‌ల‌కండం అంటే మామూలు విష‌యం కాదు.

#KgPualsa #Fish #HugeDemand #Pulasa Fish #HugeDemand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు