‘సాక్ష్యం’లో ఏం ఉందని మరీ ఇంత డిమాండ్‌?     2018-07-23   12:01:01  IST  Ramesh Palla

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాక్ష్యం’ చిత్రం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం హక్కుల కోసం ఎగబడుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రం ఫాంటసీ నేపథ్యం అవ్వడంతో అందరిలో కాస్త అంచనాలున్నాయి. అయితే సినిమా ఆహా ఓహో ఉంటుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమా స్థాయిని పెంచేశాయి. ఎంతైన ఒక చిన్న హీరో మూవీ స్థాయి కంటే ఎక్కువగా సాక్ష్యం మూవీ బిజినెస్‌ జరుగుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సాక్ష్యం’ మూవీ ఏకంగా 42 కోట్లకు అమ్ముడు పోయింది. ప్రముఖ బాలీవుడ్‌ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ వారు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్‌ రైట్స్‌ను వీరు కొనుగోలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రానికి భారీ డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే లేవు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Huge Demand For Saakshyam Movie To Get More Profit-

Huge Demand For Saakshyam Movie To Get More Profit

డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని ఎందుకు ఇంత పెద్ద మొత్తాలకు తీసుకుంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా ట్రైలర్‌లో మంచి షాట్స్‌ పెట్టి ప్రేక్షకులను ఊరించే అవకాశం ఉంది. కాని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచుకుని భారీ మొత్తాన్ని పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇప్పటి వరకు చేసిన ఏ చిత్రం కూడా 40 కోట్ల షేర్‌ను క్రాస్‌ చేయలేదు. మరి ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు పెట్టుకున్న నమ్మకం నిలిచేనా. బెల్లంకొండ హీరోకు మొదటి బిగ్గెస్ట్‌ సక్సెస్‌ దక్కేనా చూడాలి. భారీ ఎత్తున ఈ చిత్రంపై అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్లను ఎంత మేరకు ఆదుకుంటుందో చూడాలి.