శాత‌క‌ర్ణి దెబ్బ‌కు ఖైదీ క్లీన్ బౌల్డ్‌     2016-12-26   23:50:30  IST  Raghu V

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో అదిరిపోయే ఫైట్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న బాల‌కృష్ణ ఇద్ద‌రు త‌మ కేరీర్ ప‌రంగా ల్యాండ్ మార్క్ మూవీల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్నారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రెండు ఒక్క రోజు తేడాలో థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.

ఈ రెండు సినిమాలు ట్రైల‌ర్లు, టీజ‌ర్లు, స్టిల్స్‌తో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పోటీప‌డుతున్నాయి. ఆయా హీరోల అభిమానుల‌కు ఎలా ఉన్నా క్రిటిక్స్‌, ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల ప్ర‌కారం శాత‌క‌ర్ణిపైనే అంద‌రూ ఎక్కువ ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక జ‌యాప‌జ‌యాలు, క‌లెక్ష‌న్లు, ప్రి రిలీజ్ బిజినెస్ సంగ‌తి ఎలా ఉన్నా స‌గ‌టు సినీ అభిమాని సైతం శాత‌క‌ర్ణి స్టోరీ ఎలా ఉంటుంది, ద‌ర్శ‌కుడు క్రిష్ దానిని ఎలా ప్ర‌జెంట్ చేశాడ‌నే అంశంమీదే ఎక్కువ ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు.

ఈ రెండు సినిమాల షూటింగ్‌లు స్టార్ట్ అయిన‌ప్పుడు మాత్రం అంద‌రూ శాత‌క‌ర్ణి కంటే ఖైదీకే ఓటేశారు. చిరు 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత న‌టిస్తున్న సినిమా కావ‌డంతో పాటు కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి అన‌గానే కాస్త శాత‌క‌ర్ణి కంటే మొగ్గుగా అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం టీజ‌ర్లు, ట్రైల‌ర్లు వ‌చ్చాక‌, సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది చూస్తుంటే అంచ‌నాలు త‌ల్ల‌కిందుల‌య్యాయి. అంద‌రూ ఖైదీ కంటే శాత‌క‌ర్ణి వైపే మొగ్గు చూపుతున్నారు.

శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ త‌ర్వాత ఖైదీ క్లీన్‌బౌల్డ్ అయ్యింద‌న్న చ‌ర్చ‌లు కూడా ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్‌వ‌ర్గాల్లోను వినిపిస్తున్నాయి. ఇలాంటి హిస్టారిక‌ల్ మూవీని క్రిష్ కేవ‌లం 8 నెల‌ల్లో ఇంత క్వాలిటీతో తెర‌కెక్కించిన తీరుకు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఈ టీజ‌ర్ యునానిమ‌స్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిరు ఖైదీ నెంబ‌ర్ టీజ‌ర్‌లో చెప్పిన డైలాగ్స్ చేస్తా…చూస్తా…కోస్తా ఎప్పుడో పాత సినిమాల డైలాగ్స్‌ను త‌ల‌పిస్తున్నాయ‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఖైదీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి సినిమాను త‌ల‌పించేలా ఉంద‌న్న గుస‌గుస‌లు కూడా బ‌య‌ట‌కు పొక్కేశాయి.

ఓవ‌రాల్‌గా ఖైదీ బిజినెస్ రూ.100 కోట్లు అని బ‌య‌ట‌కు టాక్ వ‌స్తున్నా…బ‌య్య‌ర్లు భారీ రేట్లు చెల్లించేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో చాలా చోట్ల చెర్రీ సొంతంగా రిలీజ్ చేస్తున్న‌ట్టు కూడా మ్యాట‌ర్ లీక్ అయ్యింది. ఇటీవ‌ల ధృవ విష‌యంలో కూడా నిర్మాత అల్లు అర‌వింద్ చెప్పిన భారీ రేట్ల‌కు కొనేందుకు బ‌య్య‌ర్లు ముందుకు రాక‌పోవ‌డంతో అర‌వింద్ చాలా ఏరియాల్లో ఓన్‌గా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక శాత‌క‌ర్ణి బిజినెస్ కూడా బాల‌య్య సినిమా జ‌ర్నీ చ‌రిత్ర‌లోనే టాప్ రేట్ల‌కు అమ్ముడైనా అది మ‌రీ ఎక్కువ‌గా కాకుండా రీజ‌న్‌బుల్‌గానే ఉండ‌డంతో శాత‌క‌ర్ణి అన్ని ఏరియాల్లోను బిజినెస్ కంప్లీట్ చేసేసింది. ఏదేమైనా టాలీవుడ్‌లో గ‌త కొద్ది రోజులుగా పెనుమార్పు వ‌చ్చింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్రేక్ష‌కులు హీరోల బిల్డ‌ప్పులు, హీరోయిజం క‌న్నా కంటెంట్‌నే కింగ్ చేస్తున్నారు. మ‌రి ఈ రెండు సినిమాల విష‌యంలో ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.