సలార్ ఆడిషన్స్ కోసం ఏకంగా క్యూ కట్టిన కుర్రాళ్ళు

సినిమాలో నటించడం అనేది చాలా మంది ఫాషన్ గా ఎంచుకుంటారు.అయితే ఇలా ఈ రంగంలోకి వచ్చేవారిలో చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు.

 Huge Crowd For Salaar Auditions In Hyderabad, Tollywood, Bollywood, Pan India Mo-TeluguStop.com

ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఎక్కువ అయ్యాక కొత్త హీరోలకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే నిలబడటం కష్టం.

ఒక వేళ వచ్చిన ఆర్ధికంగా బలంగా ఉండి, హీరోల సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని సినిమాలు తీసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.అయితే ఎంత తక్కువ అవకాశాలు ఉన్న వెండితెరపై ఏదో చిన్న పాత్రలో అయిన కనిపించాలని చాలా మంది తహతహలాడుతూ ఉంటారు.

అలాంటి వారు నిత్యం ఆడిషన్స్ కి వెల్తూ ఉంటారు.పెద్ద సినిమా ఆడిషన్స్ అంటే అక్కడికి వందల నుంచి వేల సంఖ్యలో క్యూ కడతారు.

Telugu Bollywood, Hyderabad, Pan India, Prasanth Neel, Salaar, Tollywood-Movie

ఇక డార్లింగ్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం వస్తుంది అంటే ఇక ఆ సంఖ్య రెట్టింపు అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఇప్పుడు అదే జరుగుతుంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే పాన్ ఇండియా మూవీ సలార్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్ ఇచ్చింది.తాజాగా దానికి సంబందించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో వేలాదిగా ఈ ఆడిషన్స్ కోసం కుర్రాళ్ళు తరలి వచ్చారు.కరోనాని కూడా లెక్క చేయకుండా ఆడిషన్స్ లో పాల్గొన్నారు.

అయితే వీరిలో చాలా మంది ప్రభాస్ ని చూడాలనే ఉద్దేశ్యంతోనే ఆడిషన్స్ లో పాల్గొనగా, ప్రభాస్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చిన చాలానే ఉద్దేశ్యంతో కొంత మంది హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube