అక్కడ పవన్ క్రేజ్ పెరిగిందా తగ్గిందా ?

రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ బలాబలాలు లెక్క వేసుకునేందుకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే వారు ఎక్కువగా ఉండటం, ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉండడంతో ఖచ్చితమైన రిజల్ట్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

 Huge Crazy In Pawan Kalyan In Social Media-TeluguStop.com

అది కాకుండా సోషల్ మీడియాలో పట్టు సాధిస్తే అది తమకు చాలా మైలేజ్ తీసుకు వస్తుందని అభిప్రాయం రాజకీయ పార్టీల్లో నెలకొంది.అందుకే ఈ మీడియాకు అంతగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇప్పుడు ఇదే వేదిక ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అంచనా వేసే పనిలో పడింది.పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉందని ఆయన ప్రసంగాలు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయని అందరికీ తెలుసు.

ఇక సోషల్ మీడియాలోనూ ఆ పార్టీ వారు యాక్టివ్ గా ఉంటారు.కామెంట్లకు కొదవే ఉండదు.

దీనిని ఆధారంగా చేసుకొని జనసేన మీడియా పవన్ క్రేజ్ ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చేస్తూ ఉంటుంది.

Telugu Apcm, Janasenapawan, Pawan Kalyan, Pawankalyan-Telugu Political News

కొద్ది రోజుల క్రితం పవన్ విశాఖలో చేపట్టిన ఇసుక లాంగ్ మార్చ్, అలాగే విజయవాడ విశాఖ లో పార్టీ క్రియాశీలక నాయకుల భేటీలో పవన్ చేసిన ప్రసంగాలు బాగా వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనిపై రకరకాలుగా సోషల్ మీడియా జనాలు స్పందించారు.

ముఖ్యంగా విశాఖ లాంగ్ మార్చ్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించడం పై పవన్ స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరిగింది.ఆ తర్వాత పవన్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఎక్కువమంది ప్రత్యక్షంగాను పరోక్షంగా సమర్పించారు.

ఉన్న వారి బిడ్డల కైనా ఇంగ్లీష్ చదువులు ? పేదలు దళితులు బిడ్డలకు ఇంగ్లీష్ అక్కర్లేదా అంటూ జగన్ చేసిన ప్రసంగం అందరిని ఆలోచింపజేసింది.అంతేకాదు దీని పై జగన్ ను సమర్థిస్తూ కామెంట్లు చేశారు.

తెలుగును వైసీపీ ప్రభుత్వం కూని చేస్తుందని, ప్రజాప్రతినిధులు ఎవరికి తెలుగు భాషపై మమకారం లేదని పవన్వై విమర్శించారు.

Telugu Apcm, Janasenapawan, Pawan Kalyan, Pawankalyan-Telugu Political News

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా టిడిపి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా అప్పుడు వైసిపి అడ్డుకోలేదా అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించడం పై నెటిజెన్లు పలు ప్రశ్నలు సంధించారు.పవన్ గారు ఇంతకీ మీ పిల్లలను తెలుగులోనే చదివిస్తున్నారా లేదా అంటూ కామెంట్ లు చేశారు.మొత్తంగా చూస్తే ఈ వ్యవహారాలన్నిటిని చూస్తే పవన్ ప్రసంగాలను సమర్థించే వారికంటే విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా కనిపించిందట.

అది కాకుండా తెలుగుదేశం పార్టీతో పవన్ సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడంపైనా పెద్ద ఎత్తున విమర్శలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube