కేజీఎఫ్ 2 ఆడిషన్ క్రేజ్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ ఇండియాలో నాన్ సూపర్ హిట్ చిత్రంగా నిలిచి కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమాలో హీరోగా చేసిన రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

 Huge Crazy For Kgf 2 Audition-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ కి సిద్ధం అవుతున్నారు.ఈ సినిమ మొదటి సినిమాకి రెట్టింపు బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్టింగ్ చేసే అవకాశం సొంతం చేసుకోవాలని రీసెంట్ గా ఆడిషన్ కాల్ ఇచ్చారు.

8 నుంచి 16 ఏళ్ల వయసున్న అబ్బాయిలు, 25 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పురుషులు కావాలని చిత్ర బృందం పేర్కొంది.ఏప్రిల్‌ 26న బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న ఓ హోటల్‌లో ఆడిషన్స్‌ జరుగుతాయని తెలిపింది.ఈ నేపథ్యంలో కేజీఎఫ్ లో ఒక్క ఛాన్స్‌ కోసం అంటూ ఆడిషన్స్ కోసం హోటల్‌ ఎదుట జనాలు బారులు తీరారు.

వేల సంఖ్యలో ప్రజలు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.దాదాపు ఆరు వేల మంది ఆడిషన్స్‌ లో పాల్గొన్నట్లు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube