ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఏపీ సర్కార్ కరుణ..కరోనా విధుల్లో మరణిస్తే భారీగా పరిహారం.. !

దేశంలో కరోనా ఉగ్రవాదుల దాడికంటే ఎక్కువగానే భీభత్సాన్ని సృష్టించిందన్న విషయం తెలిసిందే.ఈ వైరస్ దాడికి లెక్కలేనన్ని జీవితాలు చెల్లాచెదురు కాగా ఎందరో ఆప్తులను కోల్పోయి విలపిస్తున్న ఘటనలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.

 Huge Compensation If Front Line Workers Die In Corona Duties-TeluguStop.com

ఈ కరోనా కొరల్లో ముఖ్యంగా వైద్య సిబ్బంది చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినారు.కేవలం మానవత్వం తో ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందించి అసువులు భాసిన వీరి సేవలకు ఏమిచ్చిన తక్కువే.

అయినవారందరు భయపడి దూరంగా వెళ్లుతున్న క్రమంలో డాక్టర్లు, నర్సులు ఇతర మెడికల్ సిబ్బంది చేసిన సాహసం చిరస్మణీయం.ఇకపోతే ఇలాంటి వారందరికి ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది.

 Huge Compensation If Front Line Workers Die In Corona Duties-ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఏపీ సర్కార్ కరుణ..కరోనా విధుల్లో మరణిస్తే భారీగా పరిహారం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాష్ట్రంలో కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి నష్టపరిహారంగా కొంత నగదు చెల్లించడానికి ముందుకు వచ్చింది.కాగా వైద్యులకు రూ.25 లక్షలు, స్టాఫ్ నర్సులకు రూ.20 లక్షలు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు మరణిస్తే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బందికి రూ.10 లక్షలు పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.అయితే కొవిడ్ విధుల్లో ఉన్నవారికే ఈ పరిహారం అందుతుందని స్పష్టం చేసింది.

#DieCorona #AP Govt #ExgratiaTo #APGovt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు