జార్జ్ ఫ్లాయిడ్ కుటుంభానికి భారీ నష్టపరిహారం...ఎంతో తెలుసా..!!!

అమెరికా చరిత్ర ఉన్నంత వరకూ చెప్పుకునే అతిపెద్ద జాత్యహంకార దాడి ఏదన్నా ఉందటే అందులో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం కూడా ఒకటి ఉంటుంది.ఫ్లాయిడ్ మృతి ట్రంప్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది.

 Huge Compensation For George Floyd's Family You Know, George Floyd , Democratic-TeluguStop.com

నల్లజాతీయులపై ఎన్నో ఏళ్ళుగా అమెరికాలో దాడులు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే కానీ జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన స్వయంగా సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రపంచం మొత్తం నిరసనలు తెలిపింది.నల్లజాతీయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపుతూ మారణహోమం సృష్టించారు.

ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.సరిగ్గా ఎన్నికల ముందు ఈ ఘటన జరగడంతో.

ట్రంప్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది.ఇదే అదనుగా చూసుకున్న డెమోక్రటిక్ పార్టీ నల్లజాతీయులకు మద్దతుగా నిలిచంది.ఎంతో మంది పౌరహక్కుల నేతలు,స్వచ్చంద సంస్థల కార్యకర్తలు ఫ్లాయిడ్ కుటుంభానికి న్యాయం చేయాలంటూ కోర్టులను ఆశ్రయించారు.మిన్నియా పోలీస్ పరిపాలన విభాగంతో పాటు, ముగ్గురు పోలీసులపై ఈ దావా దాఖలు చేశారు.

దాంతో సుదీర్ఘమైన చర్చల అనంతరం మియన్నా పోలీసు విభాగం దిగివచ్చింది.న్యాయస్థానములో కాకుండా చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భావించింది.దాంతో ఫ్లాయిడ్ కుటుంభానికి 27 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారు అధికారులు.

27 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.196 కోట్లు.అమెరికా చరిత్రలో ఈ స్థాయిలో సింగిల్ సెటిల్మెంట్ పరిహారం చెల్లించిన సందర్భాలు లేవని అంటున్నారు పరిశీలకులు.

ఈ విషయంపై ఫ్లాయిడ్ సోదరుడు స్పందిస్తూ, ఈ పరిహారం మాకు ఫ్లాయిడ్ ను తీసుకురాదు , కానీ మా కుటుంభానికి ఫ్లాయిడ్ గుర్తుగా ఉంటుంది అలాగే పోలీసులు ఇకపై నల్లజాతీయులపై దాడులు చేయాలంటే భయపడే విధంగా ఉంటుందని అన్నారు.ఈ భారీ నష్టపరిహారం ప్రకటించడంపై స్వచ్చంద సంస్థలు, నల్లజాతీయులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube