జబర్దస్త్ షోలో ఊహించని మార్పులు..వాళ్లకు ఝలక్..!

దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోను అభిమానించే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఉన్నారు.జబర్దస్త్ షోకు ప్రేక్షకుల ఆదరణ దక్కడంతో ఈ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా బుల్లితెరపై ప్రసారమైంది.

 Huge Changes In Etv Channel Jabardasth Show-TeluguStop.com

ఆ తరువాత ఈ షోను అనుకరిస్తూ ఇతర ఛానెళ్లు జబర్దస్త్ తరహా షోలను ప్లాన్ చేసినా ఆ షోలు జబర్దస్త్ కు పెద్దగా పోటీని ఇవ్వలేదు.

అయితే ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో మాత్రం జబర్దస్త్ షోకు ధీటుగా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.

 Huge Changes In Etv Channel Jabardasth Show-జబర్దస్త్ షోలో ఊహించని మార్పులు..వాళ్లకు ఝలక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ వారం ప్రసారమైన జబర్దస్త్ షో ఎపిసోడ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం.ప్రతి గురు, శుక్రవారాలలో జబర్దస్త్ షోలో ఆరు స్కిట్లు, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఆరు స్కిట్లు ప్రసారమయ్యేవి.

అయితే గత గురువారం, శుక్రవారం జబర్దస్త్ ఐదు స్కిట్లతో, ఎక్స్ట్రా జబర్దస్త్ ఐదు స్కిట్లతో ప్రసారమయ్యాయి.మిగిలిన అరగంట సమయంలో గతంలో హిట్ అయిన స్కిట్లు ప్రసారమవుతున్నాయి.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఒక్కో స్కిట్ చొప్పున కోత విధించి ఆ కమెడియన్లను వేరే టీమ్స్ లో కలిపేసి జబర్దస్త్ నిర్వాహకులు ఝలక్ ఇచ్చినట్టు సమాచారం.అయితే ఈ మార్పులకు కారణం తెలియాల్సి ఉంది.

గతంలో కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో ఇలాంటి మార్పులు జరిగిన సంగతి తెలిసిందే.గతంలో నాగబాబు, రోజా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిగా వ్యవహరించగా ఇప్పుడు నాగబాబు స్థానంలో మనో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

స్టార్ యాంకర్లు రష్మీ, అనసూయ ఈ షోలకు యాంకర్లుగా వ్యవహరించడంతో పాటు వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

#Huge Changes #Mallemala #Etv Channel #Jabardasth Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు