నాని 'దసరా'కు భారీ డిమాండ్.. మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ..

న్యాచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు క్లాస్ హీరోగా ప్రేక్షకులను మెప్పించి తెలుగు వారి అభిమానాన్ని పొందాడు.అయితే ఇప్పుడు మాత్రం సరికొత్తగా ట్రై చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు.

 Huge Business For Nani S Dasara, Nani, Dasara, Keerthy Suresh, Dasara Business ,-TeluguStop.com

ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసిన నాని ఇకపై మాత్రం మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు.తన నెక్స్ట్ సినిమా సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ”దసరా” సినిమా చేస్తున్నాడు.రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేసారు మేకర్స్.ఇవన్నీ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా నిలిచాయి.

అలాగే ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.

Telugu Dasara, Nanis Dasara, Keerthy Suresh, Nani, Srikanth Odela-Movie

ఈ టీజర్ వచ్చిన తర్వాత అయితే నాని ఊర మాస్ లుక్ కు ఈయన యాసకు ఇంకా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మేకింగ్ కు ఆడియెన్స్ ఆశ్చర్య పోయారు.ఒక్క చిన్న టీజర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.న్యాచురల్ స్టార్ నాని మేకోవర్ మాత్రమే కాదు ఫుల్ బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుని అదరగొట్టాడు.

ఇక ఈ టీజర్ ప్రభావంతో దసరా సినిమాకు ముందు కంటే మరిన్ని భారీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది.

Telugu Dasara, Nanis Dasara, Keerthy Suresh, Nani, Srikanth Odela-Movie

ఇప్పటికే పలు చోట్ల థియేట్రికల్ డీల్ క్లోజ్ అవ్వగా మిగతా చోట్ల భారీ డిమాండ్ నెలకొందట.దీంతో నాని దసరా సినిమా గట్టిగానే బిజినెస్ చేసేలా ఉంది.మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube