నగరంలో చోటు చేసుకున్న భారీ పేలుడు.. !

ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజల జీవితాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.ఒకవైపు బ్రతకడానికి సరిపడ ఉపాధి లేకపోవడం, మరో వైపు లాక్‌డౌన్ ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో దిక్కుతోచని స్దితిలో పేదల జీవితాలున్నాయి ఇక ఇప్పటికే కరోనా వల్ల భయపడుతుండగా మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగే ఊహించని ప్రమాదాలు ఇంకా భీతిగొల్పేలా ఉన్నాయి.

 Huge Blast In The-TeluguStop.com

ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందో అనే టెన్షన్లో జీవించవలసి వస్తుంది.

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో జరిగిన భారీ పేలుడు స్దానికంగా కలకలం రేపింది.

 Huge Blast In The-నగరంలో చోటు చేసుకున్న భారీ పేలుడు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ వ్యక్తి రెండు బ్యాగులు మోసుకుంటూ వచ్చి జయరాంనగర్ చౌరస్తా వద్ద ఒకదానిని విసిరేయగా భారీ శబ్దంతో అది ఒక్కసారిగా పేలిపోయింది.ఆ పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు వరకు వినిపించింది.

కాగా పేలుడు ధాటికి పక్కనే ఉన్న పూజాసామగ్రి దుకాణం అద్దాలు బద్దలయ్యాయని సమాచారం.

ఇకపోతే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్దలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి చేతిలో ఉన్న మరో బ్యాగును తెరించేందుకు బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు.

వారు వచ్చి మరో బ్యాగు తెరచి చూడగా అందులో చెత్త ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారట.కాగా నిందితుడిని విచారించగా తనకు ఆ బ్యాగ్ బాలానగర్‌లో దొరికిందని చెప్పాడు.

దానిని చూసి కుక్కలు మొరుగుతుండడంతో పడేసినట్టు చెప్పాడు.ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

#Hyderabad #Quthbullapur #Bomb Blast #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు