కొన్నాళ్లుగా బెడ్‌రూం గోడలోంచి విపరీతమైన సౌండ్స్‌... గోడ బద్దలు కొడితే ఏం వెళ్లిందో తెలిస్తే అవాక్కవుతారు  

Huge Bee Colony Removed From Spain Bedroom-historic Southern City Of Granada,huge Bee Colony,spain Bedroom,తేనెటీగలు

ప్రశాంతంగా నిద్ర పోవాల్సిన పడక గదిలో ఏదైనా శబ్దం ఉంటే నిద్ర పోవడం కష్టం. ఇక చెవుల్లో జోరిగ మాదిరిగా బజ్‌జ్‌జ్‌…. అంటూ ఏదైనా వింత శబ్దం చేస్తే నిద్ర పడుతుందా అంటే అస్సలు లేదు. స్పెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు..

కొన్నాళ్లుగా బెడ్‌రూం గోడలోంచి విపరీతమైన సౌండ్స్‌... గోడ బద్దలు కొడితే ఏం వెళ్లిందో తెలిస్తే అవాక్కవుతారు-Huge Bee Colony Removed From Spain Bedroom

అతడి బెడ్‌ రూంలో చాలా పెద్ద ఎత్తున ఏదో తెలియని సౌండ్‌ వస్తూ ఉంది. ఎప్పుడో ఒకసారి ఆ శబ్దం ఆగినా ఎక్కువ సమయం వస్తూనే ఉంది.

మొదట ఆ శబ్దాలు పక్కింటి నుండి వస్తున్నాయని భావించాడు.

పక్కింట్లో వాషింగ్‌ మెషన్‌ అయ్యి ఉంటుందని అనుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడో నిర్మాణ పని జరుగుతుందని భావించాడు. చుట్టు పక్కల చూస్తే ఎక్కడ అలాంటిది కనిపించలేదు.

దాంతో ఏదో సమస్య తన ఇంటి గోడలోనే ఉందనే నిర్ధారణకు వచ్చాడు. గోడ వద్దకు వెళ్లి చెవి పెట్టి చూడగా మరింత సౌండ్‌ తో ఏదో పురుగుల సౌండ్‌ వచ్చింది. దాంతో అతడు కంగారు పడి గోడను బద్దలు కొట్టాలని ఫిక్స్‌ అయ్యాడు.

అందుకోసం అవసరమైన సరంజామా సిద్దం చేసుకున్నాడు.

ఇంట్లో వారిని బయటకు పంపించి గోడను బద్దలు కొట్టడం ప్రారంభించాడు. కొద్ది సేపు కష్టపడ్డ తర్వాత గోడను కొద్ది మొత్తంలో పగులగొట్టాడు. అప్పుడే ఆ గోడలోంచి తేనెటీగలు బయటకు వస్తున్నాయి.

కొన్ని తేనె టీగలు బయటకు రాగానే అతడు తన పనిని ఆపేశాడు. అందులో తేనె టీగలు ఉన్నాయని అతడికి అర్థం అయ్యింది. పెద్ద మొత్తంలో తేనె టీగలు ఉండి ఉంటాయని, అవి అన్ని బయటకు వస్తే ప్రమాదం అని భావించిన ఆ వ్యక్తి స్పెషలిస్ట్‌లను పిలిపించాడు..

వారు మాస్క్‌లు ధరించి గోడను మరింద బద్దలు కొట్టి అందులో ఉన్న మొత్తం తేనె టీగలను తొలగించడం జరిగింది. దాదాపు 80 వేల తేనె టీగలు అందులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందులో ఒక తేనె తుట్టెనే తేనెటీగలు పెట్టాయి. అవి అందులో ఎలా పెట్టాయి, అసలు అందులోకి తేనెటీగలు వెళ్లాయి అనే విషయం ప్రస్తుతం అందరిలో ఆశ్చర్యంను కలిగిస్తోంది. గోడలో తేనెటీగల వల్ల గత కొన్నాళ్లుగా ఆ జంట పడ్డ నరకయాతనకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.