టీఆర్ఎస్ ప్లీనరీ : భారీ ఏర్పాట్లు.. భారీ అంచనాలు

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ద్వి దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను భారీగా చేపట్టింది.భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు హాజరు కాబోతూ ఉండడంతో ఆ స్థాయిలోనే ఏర్పాట్లను చేసింది.

 Huge Arrangements For The Trs Party Plenary Trs , Telangana, Kcr, Ktr, Hujurabad-TeluguStop.com

ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని బాధ్యతలను పార్టీలోని నాయకులకు పూర్తిగా  అప్పగించారు.స్వయంగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

దాదాపు ఆరు వేల మంది ఈ సభకు హాజరు కాబోతూ ఉండడంతో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు.ఈ రోజు హైటెక్స్ వేదికగా టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహించబోతున్నారు.

ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సేషన్ ను నిర్వహించబోతున్నారు.మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించబోతున్నారు.

ఈ ప్లీనరీకి హాజరయ్యే టీఆర్ఎస్ శ్రేణులకు ఇప్పటికే ప్రత్యేక పాసులను జారీ చేశారు.అంతేకాకుండా తప్పనిసరిగా  మగవారు గులాబీ రంగు చొక్కా, మహిళలు గులాబీ రంగు చీర ధరించి రావాలని కేటీఆర్ సూచించారు.

మొత్తం సభా వేదిక చుట్టూ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.టిఆర్ఎస్ ద్వి దశాబ్ది వేడుకల సందర్భంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు అన్నిటిని గులాబీ జెండాలతో టిఆర్ఎస్ శ్రేణులు అలంకరించాయి.

ఎక్కడ చూసినా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి.ఈ ప్లీనరీకి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నాయకులు వస్తుండడంతో దానికి తగ్గట్లుగానే ఏర్పాటు చేశారు.అలాగే ప్రత్యేక వంటకాలు , సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను చాలా దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

ఈ ప్లీనరీ దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు .ఇదిలా ఉంటే టిఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేవలం ఓకే నామినేషన్ దాఖలు అయింది.

Telugu Etela Rajendar, Hitex, Hujurabad, Ktr, Telangana, Trs Plinary, Trs-Telugu

దీంతో మరోసారి కూడా కెసిఆర్ ను టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నారు.అలాగే ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా 20 మీటర్ల వెడల్పు కాన్వాస్ పై 20 ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలను గీయబోతున్నారు.ఇక స్వాగత ద్వారాన్ని కూడా భారీగా ఏర్పాటు చేశారు.వేలాది ఫోటోలతో టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను చూపించబోతున్నారు.అలాగే టిఆర్ఎస్ ఏడేళ్ల  పాలనలో జరిగిన అభివృద్ధి , సంక్షేమం పైనా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.ఈ ప్లీనరీ ద్వారా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి అని, అలాగే ఈ సభ ప్రభావం హుజురాబాద్ ఎన్నికల పైన స్పష్టంగా కనిపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube