కవిత దీక్ష కు భారీ ఏర్పాట్లు ! షెడ్యూల్ ఈ విధంగా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా దీక్ష కార్యక్రమాన్ని యధావిధిగా చేపట్టనున్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కవిత ఈ ధర్నాకు దిగుతున్నారు.

 Huge Arrangements For Kavita Diksha! The Schedule Is As Follows Kcr, Ktr, Kavith-TeluguStop.com

ఈ ధర్నా దీక్ష కార్యక్రమం పై ఇప్పటివరకు ఉత్కంఠ నెలకొంది.దీనికి కారణం ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం, విచారణకు నిన్ననే హాజరు కావాల్సిందిగా కోరడం, దీనికి కవిత ఈడి అధికారులకు సమాధానం ఇవ్వడం, ఈనెల 15వ తేదీన విచారణకు హాజరవుతానని పేర్కొనడం వంటివన్నీ జరిగాయి.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత నేడు దీక్ష, ధర్నా కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.పోలీసులు నుంచి ఆమెకు అనుమతి లభించింది.

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ కవిత ఈ దీక్ష ధర్నాకు దిగుతున్నారు.అలాగే ఈ మహిళ బిల్లును ఆమోదించడం ద్వారా, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ లభిస్తుందని కవిత చెబుతున్నారు.

ఇదే డిమాండ్ తో ఈరోజు దీక్ష చేపడుతున్నారు.

Telugu Kavitha, Kavithadelhi, Sitharam Echuri-Politics

భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ దీక్ష కార్యక్రమం జరుగుతుంది.ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.సిపిఐ, సిపిఎంతో పాటు, ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాది పార్టీ, డిఎంకె, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన , పిడిపి, జెడియు ఆర్జెడి అకాళీధర్ ఆర్ ఎల్ డి జే ఎం ఎం తో పాటు, 18 పార్టీలు సంఘీభావం ప్రకటించినట్లుగా కవితను పేర్కొన్నారు.

ఈ దీక్ష కార్యక్రమాన్ని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.ఈరోజు ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుంది.

సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి 29 రాష్ట్రాల్లోని మహిళా హక్కుల కోసం పోరాడుతున్న వారంతా పాల్గొంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పార్టీల తరఫున ప్రతినిధులు కవిత ధర్నాదీక్ష కార్యక్రమంలో పాల్గొంటారని, మొత్తంగా 5000 మంది ఈ ధర్నాలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Telugu Kavitha, Kavithadelhi, Sitharam Echuri-Politics

ఈ దీక్షను విజయవంతం చేయడం ద్వారా, కేంద్రంలో బిజెపిని ఇరుక్కున్న పెట్టాలనే వ్యూహంతో బిఆర్ఎస్ ఉంది.అలాగే లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసినా ఇదంతా కక్షపూరితంగా కేంద్ర చేస్తోందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా బీఆర్ ఎస్ కు, కవితకు మద్దతు కూడగట్టవచ్చనే లెక్కల్లో ఈ రోజు ధర్నా, దీక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube