జనసేన ఆవిర్భావ సభకి భారీ ఏర్పాట్లు! ఆసక్తి గమనిస్తున్న రాజకీయ నేతలు!  

జనసేన పార్టీ ఆవిర్భావ సభకి భారీ ఏర్పాట్లు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న జనసేన సైనికులు. .

Huge Arrangements For Janasena Public Meeting In Rajahmundry-april 11 Elections,huge Arrangements For Janasena Public Meeting,pawan Kalyan,rajahmundry,tdp,ysrcp

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగిన పార్టీ జనసేన. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలని సమర్ధవంతంగా ఎదురొడ్డి, వారి రాజకీయ ఎత్తులని ఎదుర్కొంటూ, తనపై మానసికంగా జరుగుతున్నా దాడిని తట్టుకొని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నాడు. 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలతో పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తానంలో మరో అడుగు వేస్తుంది. జనసేన మరో నెల రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన కూడా ప్రజా ఆమోదం ఎన్నికల బరిలోకి వెళ్తుంది...

జనసేన ఆవిర్భావ సభకి భారీ ఏర్పాట్లు! ఆసక్తి గమనిస్తున్న రాజకీయ నేతలు!-Huge Arrangements For JanaSena Public Meeting In Rajahmundry

ఇదిలా ఉంటే ఎన్నికల బరిలో జనసేన పార్టీ నుంచి ఇప్పటికే మొదటి అభ్యర్ధుల జాబితాని సిద్ధం చేసి అనౌన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అయ్యారు.

ఇదిలా ఉంటే రేపు రాజమండ్రి వేదికగా జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికోసం జనసేన పార్టీ క్యాడర్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. పార్టీ ఆవిర్భావ సభ కావడం, అది కూడా ఎన్నికల ముందుగా జరగడంతో ఈ సభకి లక్షల సంఖ్యలో జనసేన అభిమానులు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసారు. అలాగే సభా ప్రాంగణంకి వచ్చే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటె జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఎ విషయాలపై మాట్లాడబోతున్నాడు, అలాగే రేపటి రాజకీయాలలో ఈ సభతో ఎంత వరకు ప్రభావం చూపించ గలడు అనే విషయాలపై టీడీపీ, వైసీపీ పార్టీలు అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తుంది..