భారీ అనకొండ.. భయం లేకుండా ఆడుకుంటున్న బాలిక!

సాధారణంగా చాలా మంది చిన్న పామును చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు.పాము పక్క నుంచి పాక్కుంటూ వెళ్తే ఆ రాత్రి వారికి నిద్ర పట్టదు.

 Huge Anaconda .. Girl Playing Without Fear! Big Phyton, Viral Latest, Viral News, Social Media, Viral, Playing-TeluguStop.com

పొరపాటున ఏదైనా విషపూరితం కాని పాము చిన్న కాటు వేసినా, సగం ప్రాణాలు పోతాయి.అందుకే పాము పేరు వినగానే చాలా మందికి ఎక్కడా లేని భయం ముంచుకొస్తుంది.

సినిమాలలో చూపించినట్లు వాటిని మెడలో వేసుకుని తిరగడం సాధారణ ప్రజలకు అసాధ్యమైన పని.ఏదైనా విషపూరిత పాము కనపడితే చాలు వాటిని కర్రలతో కొట్టి చంపేస్తారు.భక్తి భావం ఉన్న వారైతే పాలు, గుడ్లు వంటివి పెట్టి దూరంగా ఉండిపోతారు.ఆ తర్వాత ఆమడ దూరం నుంచే నమస్కారం పెట్టి, వెళ్లిపోతారు.అయితే ఏదైనా భారీ అనకొండ మన కళ్ల ముందే ఉంటే ఎవరికైనా భయం వేస్తుంది.అలాంటిది ఓ చిన్నారి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా దానితో ఆడుకుంటోంది.

 Huge Anaconda .. Girl Playing Without Fear! Big Phyton, Viral Latest, Viral News, Social Media, Viral, Playing -భారీ అనకొండ.. భయం లేకుండా ఆడుకుంటున్న బాలిక-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారీ సైజులో ఉండే అనకొండలు దేనినైనా అవలీలగా మింగేస్తాయి.మనిషిని సైతం లటుక్కున మింగేసి, ఏదో ఒక చెట్టుకు చెట్టుకుంటాయి.

ఫలితంగా లోపల ఉన్నది ఏదైనా నుజ్జునుజ్జు అయిపోతుంది.ఆ తర్వాత ఎంచక్కా దానిని జీర్ణం చేసుకుంటుంది.

అందుకే అనకొండలు, కొండ చిలువలు విషపూరితం కాకపోయినా, వాటిని చూస్తే అంతా భయపడతారు.అయితే ఓ బాలిక మాత్రం తన దగ్గరున్న అనకొండను ఎంతో ప్రేమగా చూసుకుంటోంది.

స్నేహితురాలితో ఆడుకుంటున్నట్లు దానితో ఆడుకుంటోంది.ఇక కొండ చిలువ కూడా చక్కగా సేదదీరుతోంది.

సాధారణంగా ఇలాంటి పైథాన్‌ను చూస్తే చాలా మంది జడుసుకుంటారు.అలాంటిది ఏ మాత్రం భయం లేకుండా ఆ అమ్మాయి దానితో ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియోను చూసిన వారు కొందరు భయపడుతున్నారు.చిన్న పిల్లలను అలాంటి జీవుల వద్ద వదిలేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని, అది అమాంతంగా మింగేయగల సామర్థ్యం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇక munding_aji అనే పేరున్న యూజర్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఇప్పటికే దీనికి లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube