Ram Pothineni : రామ్, బోయపాటి సినిమా అప్డేట్.. మగధీరను మించి ఫైట్ సీన్స్?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ( ram pothineni )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో రామ్ పోతినేని గత ఏడాది ది వారియర్ ( The Warrior )సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Huge Action Sequence In Boyapatirapo-TeluguStop.com

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

డైరెక్టర్ లింగుస్వామి( Director Linguswamy ) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇకపోతే హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ( Boyapati Srinu )దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో ఊర మాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు రామ్ పోతినేని.ఇకపోతే డైరెక్టర్ బోయపాటి సినిమాల గురించి మనందరికీ తెలిసిందే.డైరెక్టర్లలో మాస్ కి మొగుడు అంటే ముందుగా బోయపాటి పేరే వినిపిస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఒకప్పుడు ఇరవై మంది వుంటే భారీ ఫైట్ అనేవాళ్ళు.

కానీ మగధీరతో ఈ లెక్క వందకి చేరింది.తర్వాత వంద కూడా దాటేసే భారీ యాక్షన్ సీన్లు తెరపై కనిపించాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు మార్క్ ని 1500 కి చేర్చారు డైరెక్టర్ బోయపాటి.రామ్ పోతినేను,బోయపాటి కలయికలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ వుంది.ఈ సీన్ లో 1500 మంది ఫైటర్స్ కనిపిస్తారని తెలుస్తోంది.1500 మందితో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు.ఈ రోజు నుంచే ఈ ఫైట్ చిత్రీకరణ ప్రారభించారు.

పది రోజుల పాటు ఈ ఫైట్ ని షూట్ చేస్తారు.అఖండకి అదిరిపోయే యాక్షన్ అందించిన స్టంట్ శివ ఈ ఫైట్ కి యాక్షన్ కొరియోగ్రఫర్.

ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube