ఆరు సింహాలను వెంటబెట్టుకొని హడల్ పుట్టిస్తున్న యువతి... వీడియో వైరల్..!

Huddle Young Woman Chasing Six Lions

సాధారణంగా సింహాలను దూరం నుంచి చూస్తే ఒంట్లో వణుకు పుడుతుంది.ఎందుకంటే ఇవి అత్యంత క్రూరమైనవి.

 Huddle Young Woman Chasing Six Lions-TeluguStop.com

ఈ కౄర జంతువులు మనుషులతో సహా అన్ని జంతువులను చంపేస్తుంటాయి.అయితే అలాంటి సింహాలను వాకింగ్ కు తీసుకెళ్లగలుగుతారా? అంటే వామ్మో ఇంకేమైనా ఉందా! అవి క్షణాల్లోనే చంపి తినేస్తాయి అని ఎవరైనా సరే జంకుతారు.

కానీ ఓ మహిళ మాత్రం సింహాలు తనని ఏం చేయలేవని అంటోంది.అంతేకాదు వాటిని పశువులను మేతకు తీసుకెళ్లినట్లుగా అడవిలోకి తీసుకెళుతోంది.‘సరదాగా వాకింగ్ చేయిస్తున్నా, నాకు సింహాలంటే ఏం భయం లేదు’ అన్నట్లు ఫోజులిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోని సఫారీ గ్యాలరీ (@safarigallery) అనే ఒక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.

ఇది చూసి వామ్మో ఏంటి ఇది, ఇలా సింహాలతో గడుపుతోంది ?? అని నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ ఐన వీడియోలో మనం ఒక సింహాల గుంపును వాకింగ్ చేయిస్తున్న ఒక మహిళను చూడొచ్చు.ఆమె కనీసం ఐదారు సింహాల మధ్య నడుస్తూ వాటి తోకను పట్టుకొని టీజ్ చేస్తూ కనిపించింది.వాటిని అదిలిస్తూ ఆమె నిర్భయంగా ఉండగా సింహాలు చాలా శాంతంగా ఏ హానీ తలపెట్టకుండా ముందుకి వెళ్తున్నాయి.

అయితే వీటికి ఏ మాత్రం చిరాకు వచ్చినా ఆమెను చంపేయడం ఖాయం.సింహాలలో జీవులను చంపే సహజలక్షణం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతూనే ఉంటుంది.పెంచే తమ యజమానులపై కూడా ఇవి అప్పుడప్పుడూ దాడి చేస్తుంటాయి.అలాంటి 6 సింహాలను వెంటబెట్టుకొని తిరుగుతూ హడల్ పుట్టిస్తోందీ యువతి.

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.క్రూర జంతువులతో స్నేహం ఎప్పటికైనా హానికరం అని హెచ్చరిస్తున్నారు.

మరికొందరు మాత్రం ఆమె ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు.సింహాల రాణిగా, సింహాల దేవత అంటూ ఆమెను మరికొందరు పొగిడేస్తున్నారు.

వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube