ఐఫోన్ ల‌ను త‌నద‌న్నేలా కొత్త స్మార్ట్ ఫోన్స్..పీచ‌ర్స్ అదుర్స్..ఇక ఆపిల్ ప‌ని మ‌టాష్ .!!  

 • స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు యాపిల్‌ ఐఫోన్లే ఆ విషయంలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి. యాపిల్‌ ఐఫోన్లను బీట్‌ చేసే ఫోన్లను ఇప్పటి వరకు ఏ కంపెనీ తయారు చేయలేదు. అయితే హువావే సంస్థ మాత్రం తాజాగా నాలుగు కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇవి యాపిల్‌ ఐఫోన్లకు గట్టి పోటీనిస్తున్నాయి. మరి ఆ ఫోన్లు ఏమిటో వాటిల్లో ఉన్న ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా!

 • Huawei To Launch Its Mate 20 Series Smartphones On 16 October-Computation I Phones Huawei Phone Verses

  Huawei To Launch Its Mate 20 Series Smartphones On 16 October

 • హువావే ఇటీవలే మేట్‌ 20, మేట్ 20 ప్రొ, మేట్‌ 20 ఎక్స్‌, మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షె డిజైన్‌ పేరిట నాలుగు కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్లను విడుదల చేసింది. వీటిల్లో అధునాతన కైరిన్‌ 980 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాసెసర్‌ యాపిల్‌ కొత్త ఐఫోన్లలో ఉన్న యాపిల్‌ ఎ12 బయోనిక్‌ ప్రాసెసర్‌ కన్నా వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే మేట్‌ 20 సిరీస్‌ ఫోన్లలో ఉన్న మోడెమ్‌ గరిష్టంగా 1.4 జీబీపీఎస్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను అందిస్తుంది. అందుకే మేట్‌ 20 సిరీస్‌ ఫోన్లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. కేవలం ప్రాసెసర్‌ మాత్రమే కాదు, బ్యాటరీ, కెమెరాలు, ఇతర ఫీచర్ల విషయంలోనూ ఈ ఫోన్లు యాపిల్‌ ఐఫోన్లను బీట్‌ చేస్తున్నాయి.

 • హువావే మేట్‌ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల కర్వ్‌డ్‌ ఓలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫీచర్‌ ప్రస్తుతం యాపిల్‌ ఐఫోన్లలోనే ఉండడం విశేషం. అలాగే ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఇందులో అమర్చారు. 8 జీబీ ర్యామ్‌, 256 ఈబీ స్టోరేజ్‌ ఫీచర్లు మేట్‌ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. అయితే మేట్‌ 20 సిరీస్‌ ఫోన్లలో ఎక్స్‌పాండబుల్‌ మెమొరికీ నానో ఎస్‌డీ కార్డులను వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని హువావే మాత్రమే ప్రస్తుతం అందిస్తోంది. మేట్‌ 20 ప్రొలో డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్‌ వీవోఎల్‌టీఈ, ఐపీ68 వాటర్, డస్ట్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 4200 ఎంఏహెచ్‌ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ను అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌కు రివర్స్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. అంటే మరో వైర్‌లెస్‌ చార్జింగ్‌ ఫీచర్‌ ఉన్న డివైస్‌ను ఈ ఫోన్‌ ద్వారా చార్జింగ్‌ చేసుకోవచ్చన్నమాట.

 • Huawei To Launch Its Mate 20 Series Smartphones On 16 October-Computation I Phones Huawei Phone Verses
 • ఇక మేట్‌ 20 ప్రొ ఫోన్‌లో వెనుక భాగంలో మూడు కెమెరాలను అమర్చారు. 40, 20, 8 మెగాపిక్సల్‌ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు భాగంలో 24 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఇక మేట్‌ 20 ఫోన్‌ విషయానికి వస్తే ఇందులో 3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, ఇన్‌ డిస్‌ ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఫీచర్లు మిస్ అయ్యాయి. మేట్‌ 20 ఫోన్‌లో 6.53 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌లో కెమెరాల విషయానికి వస్తే… 12, 16, 8 మెగాపిక్సల్‌ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు భాగంలో 24 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది.

 • మేట్‌ 20ఎక్స్‌ ఫోన్‌ శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ నోట్‌ 9 ఫోన్‌కు గట్టి పోటీనిస్తుంది. ఇందులో 7.2 ఇంచుల ఓలెడ్‌ డిస్‌ప్లే, స్టైలస్‌ సపోర్ట్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డాల్బీ అట్మోస్‌ స్పీకర్లు ఉన్నాయి. అయితే మేట్‌ 20 ఎక్స్‌లో మిగిలిన ఫీచర్లు మేట్‌ 20 ప్రొను పోలి ఉన్నాయి. కాకపోతే 3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ మాత్రం లేదు. ఇక మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షె డిజైన్‌ ఫోన్‌లో కూడా మేట్‌ 20 ప్రొ ఫోన్‌లో ఉన్న ఫీచర్లనే అందిస్తున్నారు. కాకపోతే డిజైన్‌ను మార్చారు. నాణ్యమైన లెదర్‌, గ్లాస్‌ స్ట్రిప్‌లను పోర్షె డిజైన్‌ ఫోన్‌ కలిగి ఉంటుంది.

 • Huawei To Launch Its Mate 20 Series Smartphones On 16 October-Computation I Phones Huawei Phone Verses

 • హువావే మేట్‌ 20 సిరీస్‌ ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి…

 • మేట్‌ 20 (4జీబీ, 128 జీబీ) – 799 యూరోలు
  మేట్‌ 20 (6జీబీ, 128 జీబీ) – 849 యూరోలు
  మేట్‌ 20 ప్రొ (6జీబీ, 128 జీబీ) – 1049 యూరోలు
  మేట్‌ 20 ఎక్స్‌ (6జీబీ, 128 జీబీ) – 899 యూరోలు
  మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షె డిజైన్‌ (8జీబీ, 256 జీబీ) – 1695 యూరోలు
  మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షె డిజైన్‌ (8జీబీ, 512 జీబీ) – 2095 యూరోలు

 • మేట్‌ 20, మేట్‌ 20 ప్రొ, మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షె డిజైన్‌ ఫోన్లు ఇప్పటికే యూరోప్‌ మార్కెట్‌లో లభిస్తుండగా, మేట్‌ 20 ఎక్స్‌ ఫోన్‌ను అక్టోబర్‌ 26వ తేదీ నుంచి విక్రయించనున్నారు. కాగా భారత్‌లో ఈ ఫోన్లను ఎప్పుడు విడుదల చేసేది హువావే చెప్పలేదు. కానీ అతి త్వరలోనే భారత్‌లో మేట్‌ 20 సిరీస్‌ ఫోన్లు విడుదల కావచ్చని తెలిసింది.