జ‌గ‌న్ తీరుతో బాబు టెన్ష‌న్‌... అందుకే ఆ నిఘా       2018-07-07   01:50:25  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో ఆందోళన రోజు రోజు కి ఎక్కువయిపోతోంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశ పెట్టి నిత్యం జనంబాట పట్టినా… ఆశించిన ఫలితం కనిపించకపోవడం అదే సమయంలో జగన్ కి ఏపీలో ఆదరణ పెరుగుతుండడం ముఖ్యంగా జగన్ పాదయాత్ర చేపడుతున్న తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ కి ఆదరణ పెరుగుతుండడంతో బాబు కొత్త ఎత్తులు వేస్తున్నారు. జగన్ కి ఏ విధంగా ఆదరణ పెరుగుతుంది.. జనం ఎందుకు అటువైపు మొగ్గు చూపుతున్నారు.. ఎవరెవరు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు ఇలా.. అనేక విషయాలపై నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ విషయాలపై సమాచారం తెప్పించుకుంటున్నాడు.

వాస్తవంగా ఈ మధ్యకాలంలో జనాల ఆలోచన మారింది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను సామరస్యంగా వింటూ.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. ప్రజల్లో భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కడప జిల్లా ఇపుడుపుల నుంచి పాదయాత్ర చేపట్టిన జగన్‌కు అన్ని జిల్లాలకు మించి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే.

ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ ఏ సభ పెట్టినా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. , ఏ జిల్లాలో లేని విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇతర పార్టీల నాయకులు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో అధికార టీడీపీ వర్గాల్లో ఆందోళన పెరిగిపోయింది. అందుకే.. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌కు పెరుగుతున్న ప్రజల మద్దతుపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారని దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ జగన్ కి చెక్ పెట్టేందుకు సిద్దమవుతున్నార‌ని తెలుస్తోంది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో బాబు అధికారంలోకి వ‌చ్చేందుకు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలే కీల‌కం. ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో జ‌గ‌న్ యాత్ర‌కు అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలుపు అంత సులువు కాద‌న్న‌ది మాత్రం బాబుకు కూడా అర్థ‌మ‌వుతోంది. దీనికి తోడు ఈ రెండు జిల్లాల్లో జ‌న‌సేన ప్ర‌భావం కూడా గ‌ట్టిగానే ఉండ‌నుంది. ఈ లెక్క‌న చూస్తే బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్‌, ప‌వ‌న్ నుంచి ద‌బిడి దిబిడి ఖాయం.

,