జ‌గ‌న్ కేబినెట్లో ఆ మంత్రిపై వేటు?.. సీఎం మ‌దిలో ఏముంది!

ఏపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు పూర్తియింది.అయితే అప్పుడే సీఎం జ‌గ‌న్ ఓ విష‌యం స్ప‌ష్టంగా చెప్పారు.

 The Hunt For That Minister In The Jagannath Cabinet What Is In The Mind Of The C-TeluguStop.com

రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని తేల్చి చెప్పేశారు.ఈ నేప‌థ్యంలో అస‌లు ఎవ‌రు ఉంటారు? ఎవ‌రు త‌ప్పుకుంటార‌ని అనేక రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఓ మంత్రిపై వేటు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ మార్పులు ఉన్న నేప‌థ్యంలో స‌ద‌రు మంత్రిపై జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయిన వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుపై జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.రాష్ట్రంలో అనేక హిందూ దేవాల‌యాల‌పై జ‌రిగిన దాడులు రాష్ట్రంలో ఎంత దుమారం రేపిందో తెలిసిందే.

అయితే ఆ దాడుల‌ను అరిక‌ట్ట‌డంలో మంత్రి ఫెయిల్ అయ్యార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.ఇక దుర్గ‌గుడిలో వెండి సింహాల మాయం ఎంత పెద్ద దుమారం రేపిందో చూశాం.

ఇదే కాదు తిరుమ‌ల కొండ‌పై ఇత‌ర మ‌తాల ప్ర‌చారం కూడా అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద అస్త్రంగా మారింది.అలాగే ప్ర‌ధాన ఆల‌యాల క‌మిటీ అవినీతిపై కూడా ఆయ‌న ఫోక‌స్ పెట్ట‌లేద‌ని తెలుస్తోంది.

Telugu Jaganmohan, Ap Ycp-Telugu Political News

ఇక రాముడి త‌ల న‌రికిన ఘ‌ట‌న అప్ప‌ట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం రేపింది.ఇవన్నీ ప్ర‌భుత్వంపై వ్యతిరేక‌త రావ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి.దీనిపై జ‌గ‌న్ కూడా అప్ప‌ట్లో చాలా సీరియ‌స్ అయ్యారు.కాగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు మాత్రం విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకు కృషి చేశారు.ఇందులోఆయ‌నే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.ఇది ఆయ‌న‌కు కాస్త ప్ల‌స్ అయినా.

వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్టు స‌మాచారం.మ‌రి జ‌గ‌న్ ఆయ‌న‌పై వేటు వేస్తారా లేక జాలి చూపించి వ‌దిలేస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇక ఏదేమైనా త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గంలో మార్పులు ఉండ‌టంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క మంత్రిపై స్పెష‌ల్‌గా టాక్ న‌డుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube