ఎన్నారైలకి గుడ్ న్యూస్..  

ఉద్యోగాల నిమ్మిత్తం ఇతర దేశాలు వెళ్లాలని అనుకున్నప్పుడు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టులు కలిగిన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ముందుగానే రిజిష్ట్రేషన్ చేయించుకోవాలి అంటూ ఇటీవల కాలంలో ప్రభుత్వం సరికొత్త నిభందన తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఆ నిభంధనని భారత ప్రభుత్వం వాయిదా వేసింది..ఎన్నారైల నుంచీ వ్యక్తమవుతున్న ఆందోళనల నేపధ్యంలో యూఏఈ లోని భారతీయ అధికారులు వెల్లడించారు.

India Delays Online ECNR Registration For NRIs-Nris The Indian Government

India Delays Online ECNR Registration For NRIs

అందుకు గాను ఉత్తర్వులని సైతం జారీ చేశారు..నవంబర్ 14న విడుదల చేసిన నోటిఫిషన్‌ను రద్దు చేస్తున్నామని, తదుపరి వివరాలు వెల్లడించేవరకూ కూడా ఎన్నారైలు ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని అధికారులు తెలిపారు..ఇదిలాఉంటే గతంలోనే యూఏఈ దేశాలకి మాత్రమే కాకుండా దాదాపు 18 దేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లే ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టుదారులు విదేశాలకి వెళ్లేముందు ఈ-మైగ్రేషన్ వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకోవాలని తెలిపింది.

ఒక వేళ అలా చేయని పక్షంలో విదేశాలు వెళ్లలేరని అంటూ ,జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే తాజా ఉతర్వులతో ఎన్నారైలు ఊపిరి పీల్చుకున్నారు.