రేవంత్ , హరీష్ కు ఈసీ నోటీసులు ! ఎందుకంటే..?   Election Comission Sends Notice Harishrao Revanth Reddy     2018-11-09   19:58:37  IST  Sai M

తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ… నాయకులు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటూ … అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అయితే నాయకులు ఎక్కడికక్కడ తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడంతో … కోడ్ పరిధిలోకి ఆ అంశాలు రావడంతో ఈసీ అలెర్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది.

తెలంగాణలోని పలువురు నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు చేశారనే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్, రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.