మెగాస్టార్ కుడి చేతికి సర్జరీ.. అసలు జరిగిన కథ ఇది?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీ గా ఉండటమే కాకుండా.పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.

 Megastar Chiranjeevi Has Been Admitted To Hospital, Mega Star Chiranjeevi, Tolly-TeluguStop.com

ఈ క్రమంలోనే చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.కరోనా రెండవ దశలో ఎంతోమంది ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డారు.

ఇలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.ఏ ఒక్కరు కూడా ఆక్సిజన్ అందక మరణించకూడదని రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు.

ఇలా ప్రతి ఒక్క జిల్లాలో మెగా అభిమానుల సమక్షంలో ఏర్పాటు చేసిన బ్యాంకు ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగారు.ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన అభిమానులతో చిరంజీవి ముచ్చటించారు.

హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులను చిరంజీవి అభినందించారు.అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడంతో అభిమానులు కొంతవరకు కలవరపడ్డారు.

Telugu Hand Surgery, Chiranjeevi, Hand, Tollywood-Movie

అసలు తన చేతికి ఏమైంది ఎందుకు బ్యాండేజ్ వేశారు అంటూ అభిమానులు కంగారు పడుతున్నడడంతో చిరంజీవి స్పందిస్తూ అసలు విషయాన్ని తెలియజేశారు.తన చేతికి చిన్న శస్త్రచికిత్స జరిగిందని.15 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుందని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.కుడి చేయి మణికట్టు దగ్గర నొప్పిగా ఉండడం చేత డాక్టర్లను సంప్రదిస్తే అధిక ఒత్తిడి కారణంగా నొప్పి కలుగుతుందని, చిన్న సర్జరీ చేయడంతో పూర్తిగా సెట్ అవుతుందని చెప్పడంతో మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube