బిడెన్ కాస్త ఇటు చూడవయ్యా...వ్యాక్సిన్ వేయడంలో కూడా వివక్షేనా....

అగ్ర రాజ్యంలో నల్లజాతీయులపై వివక్ష అంశం మరోసారి తెరపైకి వచ్చింది.జాతి వివక్ష సహజంగానే అమెరికాలో ఉంటుందని అయితే వ్యాక్సినేషన్ వేసే విషయంలో కూడా తమపై వివక్ష చూపుతున్నారని నల్లజాతీయులు ఆరోపణలు చేస్తున్నారు.

 Did Biden Look A Bit Like This Is There Any Discrimination In Vaccination Too, T-TeluguStop.com

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నల్లజాతీయులపై జరిగిన దాడులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రపంచం మొత్తం ట్రంప్ పై, అమెరికా పై అసహనం వ్యక్తం చేసింది .నల్లజాతీయులు అనే ఒక్కే ఒక్క కారణం చేత వారిపై జరిగిన హింసాత్మక దాడులు హత్యలు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటాయి.ఫలితంగా ఎన్నికల సమయంలో వారు చేపట్టిన ఉద్యమం కూడా ట్రంప్ ఓటమిలో ఓ ప్రధానమైన కారణం అయ్యింది.

ట్రంప్ అధికారం కోల్పోయిన బిడెన్ అధ్యక్షుడిగా అయితే తమ తలరాతలు మారుతాయని అనుకుంటే ఇప్పుడు కూడా నల్లజాతీయులపై వివక్ష చూపిస్తున్నారని కొందరు ప్రభుత్వ యంత్రాంగం కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో కూడా వివక్షను చూపడం దారుణమని వాపోతున్నారు నల్లజాతీయులు.అమెరికాలో స్థానిక అమెరికన్స్ తో పోల్చుకుంటే నల్లజాతీయులు మూడు రెట్లు అధికంగా నల్లజాతీయులు అత్యధికంగా మృతి చెండుతున్నారని అమెరికా వ్యాధి నిరోధక నియంత్రణా కేంద్రం వెల్లడించింది…

Telugu America, Biden, Corona, Trump-Telugu NRI

దాంతో ఈ పరిస్థితులను పరిశీలించాలని, వర్ణాల ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న విధానం సరైనది కాదని, ఈ విషయంలో చర్యలు చేపట్టాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా ఆరోగ్య శాఖకు లేఖ రాశారు.శ్వేత జాతీయులతో పోల్చితే అమెరికాలో కరోన కారణంగా నల్లజాతీయులు, అలస్కా ప్రజలు, ఇండో అమెరికన్స్ అత్యధికంగా మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు వెల్లడించాలని కోరారు.

వివక్షను మానుకుని ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేలా చేయడం మన బాధ్యత అంటూ లేఖలో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube